ETV Bharat / city

NIGHT CURFEW IN AP: ఏపీలో రాత్రి కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

author img

By

Published : Jan 9, 2022, 9:55 AM IST

NIGHT CURFEW IN AP: ఏపీలో రాత్రి కర్వ్యూ.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

09:48 January 09

NIGHT CURFEW IN AP: ఏపీలో రాత్రి కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

NIGHT CURFEW IN AP: ఆంధ్రప్రదేశ్​లో రాత్రి కర్ఫ్యూ అంటూ జరుగుతోన్న ప్రచారంపై తాజాగా ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో ఏ విధమైన కర్ఫ్యూ విధించడం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ తరహా తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్న వారి గురించి ఆరా తీస్తున్నామని తెలిపింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప.. ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించింది. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

CORONA CASES: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే వివిధ రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ విధించారంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించి.. అలాంటిదేమీ లేదని స్పష్టతను ఇచ్చింది.

For All Latest Updates

TAGGED:

CORONA
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.