కరోనా బాధిత ప్రభుత్వ ఉద్యోగులకు 20 రోజుల సెలవులను మంజూరు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తరహాలోనే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు, మరో 5 రోజుల కమ్యూటెడ్ సెలవులు ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకారాన్ని తెలిపారని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ వెల్లడించింది. ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే ఈ సెలవులు వర్తింప చేయాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించిందని ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
కరోనా సోకిన ఉద్యోగులకు 20 రోజుల సెలవు ఇస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏపీలోనూ వర్తింపజేసేందుకు సీఎం అంగీకారాన్ని తెలిపినట్టు స్పష్టం చేశారు. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరికి కరోనా వచ్చినా 20 రోజుల సెలవులు మంజూరు చేస్తారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు యధాతథంగా ఏపీలోనూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: 'డెల్టా వేరియంట్‌పై టీకాల ప్రభావం తక్కువే'