ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల నిర్మాణంపై సింగిల్ జడ్జి(single judge) తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్(division bench)కు వెళ్లింది. డివిజన్ బెంచ్‌లో హౌస్‌మోషన్ పిటిషన్(house motion petition) దాఖలు చేసింది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను స్వీకరించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.
సింగిల్ బెంచ్ ఉత్తర్వులు..
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో పలు లోపాలను ఉన్నత న్యాయస్థానం(సింగిల్ బెంచ్) ఎత్తిచూపింది. ప్రధానంగా మూడు అంశాలను కోర్టు ప్రస్తావించింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని శుక్రవారం తీర్పు చెప్పింది. మహిళల పేరుతోనే పట్టాలివ్వడం సరికాదని, అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకూ ఇవ్వాలని చెప్పింది.
అర్హులకు పట్టాలు ఇవ్వాలి...
ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్ కన్వేయన్స్ డీడ్‌లను రద్దు చేసి, అర్హులకు డీ-ఫాం పట్టాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది గతేడాది డిసెంబరులో ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి శుక్రవారం ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చారు. ఇళ్ల స్థలాల విస్తీర్ణంపై కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇళ్ల నిర్మాణంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని ఆదేశించింది. మరో నెలలో ఆ కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. నివేదికను రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి.. ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని సూచించింది.
లేఅవుట్లను సవరించాలి...
లేఅవుట్లను సవరించాలని... ఆ తర్వాతే ఈ పథకాన్ని ఖరారు చేయాలని స్పష్టంచేసింది. కమిటీ నివేదిక ఆధారంగా అదనపు భూమి కొని, స్థలం విస్తీర్ణం పెంచి, లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్లను సవరించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ముగిసేవరకూ ఈ పథకం కింద కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తేల్చిచెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవో 367లోని మార్గదర్శకాలు-2,3, జీవో 488లోని క్లాజ్ 10,11,12, జీవో 99లోని క్లాజ్ బీ,డీలను చట్టవిరుద్ధమైనవంటూ, వాటిని రద్దుచేసింది. ఇదిలా ఉండగా.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం... డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కానీ ఆ రాష్ట్ర సర్కార్ చేసిన అప్పీల్‌ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది.
నేపథ్యం ఇదీ..
పేదలందరికీ ఇళ్లు పథకం కింద 25 లక్షల ఇళ్ల స్థలాలు/హౌసింగ్ యూనిట్లు ఇచ్చేందుకు జారీ చేసిన జీవోలను సవాలుచేస్తూ తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది డిసెంబరులో ఏపీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇళ్ల స్థలాలను మహిళలకే కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఆంజనేయులు వాదనలు వినిపించారు. మహిళలకే ఇళ్లపట్టాలు ఇవ్వడంపురుషులు, ట్రాన్స్‌జెండర్లపై వివక్షేనన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కుటుంబాన్ని ఓ యూనిట్‌గా తీసుకొని స్థలం కేటాయించామన్నారు.
ఇదీచదవండి: విద్యాశాఖ కీలక నిర్ణయం.. పదో తరగతిలో ఈ ఏడాది 6 పరీక్షలే..