ETV Bharat / city

ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు - ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్​

ap EX minister kollu ravindranath arrest
ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు
author img

By

Published : Jul 3, 2020, 9:29 PM IST

Updated : Jul 3, 2020, 9:56 PM IST

21:28 July 03

ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు

        ఏపీ మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం సీతాపురం జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. విశాఖ వైపు వెళ్తున్న రవీంద్రను మధ్యలోనే ఆపిన మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు.. అక్కడే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనంతరం తుని నుంచి మచిలీపట్నానికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మచిలీపట్నంలో వైకాపా నేత, మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్రపై ఆరోపణలు వచ్చాయి. ఈ హత్య కేసులో రవీంద్ర పాత్రపై కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య చేసినట్టు నిందితుడు పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు. కొల్లు రవీంద్రపై 302, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

Last Updated : Jul 3, 2020, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.