Disaster Management Flood Alert: ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, భీమవరం జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 7.74 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల యంత్రంగాన్ని అప్రమత్తం చేశామన్నారు.
గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించటం, వరద నీటిలో ఈతకు వెళ్లటం, చేపలు పట్టటం లాంటివి చేయరాదని సూచించారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇవీ చూడండి: Sharmila Padayatra: 'కేసీఆర్ మాయమాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు..'