ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 1,08,616 మందికి పరీక్షలు చేయగా.. 6,952 మందికి వైరస్ సోకింది. మహమ్మారికి మరో 58 మంది బలయ్యారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11మంది మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. అనంతపురం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. చిత్తూరు 1,199, తూర్పు గోదావరి 1,167 కరోనా కేసులు నమోదు కాగా.. పశ్చిమ గోదావరి 663, ప్రకాశం 552 మంది వైరస్ బారిన పడ్డారు.
ఇదీ చదవండి: etala resign: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా