AP Corona Cases: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 38,479 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. అత్యధికంగా చిత్తూరులో 254, విశాఖలో 196, తూర్పుగోదావరిలో 93, కృష్ణా లో 117, గుంటూరులో 104, నెల్లూరులో 103, విజయనగరంలో 83, ప్రకాశంలో 40, శ్రీకాకుళంలో 55, అనంతపురంలో 138, కర్నూలులో 29, పశ్చిమగోదావరిలో 25, కడపలో 20 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు.
Active corona cases in AP: ప్రస్తుతం ఏపీలో 4,774 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 24 గంటల వ్యవధిలో గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 14,505కు పెరిగింది. 24 గంటల్లో 140 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
- ఇవీ చదవండి :
- రాష్ట్రంలో కొత్తగా 1,673 కొవిడ్ కేసులు, ఒకరు మృతి
- Corona Cases in TS: రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు.. మరో వేవ్ తప్పదా?!
- DH Srinivas on Covid Third Wave : 'మూడో ముప్పు షురూ.. వాళ్లకి సెలవుల్లేవ్..'
- DH srinivas on omicron variant: 'సంక్రాంతి తర్వాత థర్డ్ వేవ్.. బీ అలర్ట్'
- KMC Corona: కేఎంసీలో పెరుగుతున్న కరోనా కేసులు.. మరో ఐదుగురికి పాజిటివ్