ETV Bharat / city

అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం జగన్​ కీలక నిర్ణయం - అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం జగన్​ కీలక నిర్ణయం

అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం జగన్​ కీలక నిర్ణయం

author img

By

Published : Mar 8, 2022, 2:23 PM IST

14:18 March 08

అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం జగన్​ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్​లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ వేదికగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్​మోహన్​రెడ్డి కీలక ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లా కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కన్న కలలను తాము సాకారం చేస్తామని చెప్పారు. గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదన్న జగన్​.. తన సహచరుడు, మిత్రుడు గౌతమ్​రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే గౌతమ్​రెడ్డి లేకపోయినా.. ఆయన కన్న కలలను నెరవేరుస్తామని జగన్​ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామన్న ఆయన.. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని ప్రకటించారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: మహిళా దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.