ETV Bharat / city

Disha Patrolling Vehicles : దిశ వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ - Disha Patrolling Vehicles

Disha Patrolling Vehicles : ఏపీలో మహిళల రక్షణే ధ్యేయంగా తీసుకొచ్చిన దిశ చట్టంలో భాగంగా.. దిశ పెట్రోలింగ్ వాహనాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. సచివాలయం మొదటి బ్లాక్ నుంచి జెండా ఊపి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 163 వాహనాలను కొనుగోలు చేశారు. గతంలోనూ అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు అందించారు.

Disha Patrolling Vehicles in AP
Disha Patrolling Vehicles in AP
author img

By

Published : Mar 23, 2022, 10:42 AM IST

Disha Patrolling Vehicles : ఏపీలో దిశచట్టం అమల్లో భాగంగా దిశ పెట్రోలింగ్‌ వాహనాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రారంభించారు. సచివాలయం మొదటి బ్లాక్ నుంచి ముఖ్యమంత్రి లాంఛనంగా ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్​ను మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లకు 900 ద్విచక్ర వాహనాలు మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.

Disha Patrol Vehicles in AP : జరిగిన నేరానికి సంబందించిన వివరాలు, సమయం, ప్రాంతం వంటి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేస్తూ, ఆ సమాచారాన్ని దిశ పెట్రోలింగ్ వాహనాలను పోలీస్ విభాగం అనుసంధానించింది. ఇందులో భాగంగా 163 వాహనాలను కొనుగోలు చేశారు. జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుంచి నేరుగా ప్రత్యక్ష పర్యవేక్షణకు అనుగుణంగా ప్రత్యేక జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దిశ పెట్రోలింగ్ వాహనాల కొనుగోలుకు రూ.13.85 కోట్లను వెచ్చించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.