ETV Bharat / city

ఏపీ సీఎం జగన్ బెయిల్​ రద్దు పిటిషన్​పై నేడు విచారణ

హైదరాబాద్​లోని​ సీబీఐ కోర్టులో నేడు ఏపీ సీఎం జగన్​ అక్రమాస్తుల కేసు విచారణ జరగనుంది. జగన్​ బెయిల్​ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్​పై విచారించనున్నారు.

నేడు ఏపీ సీఎం జగన్ బెయిల్​ రద్దు పిటిషన్​పై విచారణ

author img

By

Published : Jun 14, 2021, 5:09 AM IST

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. కౌంటరులో జగన్ పేర్కొన్న అంశాలపై రఘురామకృష్ణరాజు నేడు కోర్టుకు సమాధానం ఇవ్వనున్నారు.

తన బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్​పై జగన్ ఈ నెల 1న కౌంటర్​ దాఖలు చేశారు. తాను షరతులను ఉల్లంఘించలేదని.. రఘురామకృష్ణరాజు రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పిటిషన్ వేశారని కౌంటరులో పేర్కొన్నారు. రఘురామ తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదన్నారు. సీబీఐ తటస్థ వైఖరితో మెమో దాఖలు చేసింది. పిటిషన్​లోని అంశాలపై చట్టపరంగా, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. కౌంటర్లపై రీజాయిండర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ఈ నెల 1న రఘురామ తరఫు న్యాయవాది శ్రీవెంకటేశ్ కోరడంతో.. నేటికి వాయిదాపడింది.

ఇదీ చూడండి: రేపు భాజపా కండువా కప్పుకోనున్న ఈటల రాజేందర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.