తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద యడియూరప్పకు జగన్ స్వాగతం పలికారు. రంగనాయక మండపంలో ఇరువురు ముఖ్యమంత్రులకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు.
యడియూరప్పకు శ్రీవారి శేష వస్త్రాన్ని జగన్ బహుకరించారు. ఇద్దరు సీఎంలకు శ్రీవారి తీర్థప్రసాదాలను తితిదే ఈవో సింఘాల్, ఛైర్మన్ సుబ్బారెడ్డి అందించారు. నాద నీరాజనం వేదికగా సుందరకాండ పారాయణంలో ఇరువురు సీఎంలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పరీక్షలు, చికిత్సల సామర్థ్యాన్ని పెంచాలి: మోదీ