ETV Bharat / city

Ap capital: ఏపీ రాజధాని విశాఖ కాదు.. కేంద్రం వివరణ

ఏపీ రాజధాని అంశంపై లోక్​సభలో ఇచ్చిన సమాధానంపై కేంద్రం వివరణ ఇచ్చింది. హెడ్డింగ్ పొరపాటు వల్లే ఇలా జరిగిందని.. అందులో క్యాపిటల్​తో పాటు సమాచారం సేకరించిన నగరంగా పేరు చేర్చుతున్నట్లు వివరణ ఇచ్చింది.

author img

By

Published : Aug 30, 2021, 8:13 AM IST

capital
విశాఖ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విశాఖపట్నమని లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం పేర్కొన్న కేంద్రం తాజాగా నాలుక కరుచుకుంది. జులై 26న లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా విశాఖపట్నాన్ని పెట్రోలియం శాఖ పేర్కొనడం వివాదాస్పదమైంది. దీనిపై ఆ శాఖ ఆదివారం రాత్రి వివరణ ఇచ్చింది. ఈ సమాధానం ద్వారా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చెప్పడం తమ ఉద్దేశం కాదని, పెట్రో పెరుగుదలకు సంబంధించి దాన్ని ఒక ప్రతిపాదిత నగరంగా మాత్రమే (రెఫరెన్స్‌ సిటీ) ఉదహరించినట్లు పేర్కొంది.

పెట్రో ధరల పెరుగుదల వల్ల దేశంపై ప్రభావం గురించి జులై 26న ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో విధిస్తున్న పన్నులను చెప్పారు. రాష్ట్రాల పేర్లు, దాని పక్కన రాజధాని/నగరం అని ఉండాల్సిన చోట కేవలం రాజధాని అని మాత్రమే పేర్కొనడం సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైంది. విశాఖనే కాకుండా హరియాణాకు అంబాలా, పంజాబ్‌కు జలంధర్‌ అని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ తప్పును సరిదిద్దుకుంటున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘సమాధానంలోని మూడో కాలమ్‌లో రాజధాని అన్న హెడ్డింగ్‌ కింద ఇచ్చిన నగరాలను కేవలం ఆ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో విధిస్తున్న పన్నుల గురించి చెప్పడానికి మాత్రమే నిర్దేశించాం. అందువల్ల ఆ హెడ్డింగ్‌ను కేవలం రాజధాని అని మాత్రమే చదువుకోకుండా రాజధాని/ప్రతిపాదిత నగరం (కేపిటల్‌/రిఫెరెన్స్‌ సిటీ)గా చదువుకోవాలని కోరుతున్నాం. ఆ సమాధానంలో ఈ మేరకు మార్పు చేసి లోక్‌సభ సచివాలయానికి కూడా చెప్పాం’ అని పెట్రోలియం శాఖ పేర్కొంది.

వివాదాలమయం..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌, అమరావతి అంటూ తడవకో చిరునామాతో కేంద్రం లేఖలు పంపుతోంది. లోక్‌సభకు ఇచ్చే కొన్ని సమాధానాల్లోనూ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ అని పేర్కొంటున్నారు. ఈ అంశానికి ఉన్న సున్నితత్వాన్ని గుర్తించకుండా లోక్‌సభలో ఉదాసీనంగా ఇస్తున్న సమాధానాలు రచ్చకు కారణమవుతున్నాయి. చండీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా పేర్కొంటూ హరియాణాలో పెద్ద నగరమైన అంబాలా, పంజాబ్‌లో పెద్దదైన జలంధర్‌కు సంబంధించిన పెట్రో ధరల సమాచారాన్నిచ్చారు. చండీగఢ్‌ కోసం రెండు రాష్ట్రాలు గొడవ పడుతుండటంతో వాటి ఉమ్మడి రాజధానిగా దాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: ఈమె కన్న తల్లేనా? పసి బిడ్డపై మరీ ఇంత పైశాచికత్వమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.