ETV Bharat / city

Students make women safety device: గురుకుల విద్యార్ధినుల ప్రతిభ.. 'అటల్‌ ఇన్నోవేషన్‌ మారథాన్‌’కు ఎంపిక - vishaka

students make women safety device: ఏపీలోని విశాఖపట్నం జిల్లా బాలయోగి గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు మహిళా భద్రతా పరికరాన్ని తయారు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ‘ఉమెన్‌ సేఫ్టీ డివైజ్‌’ జాతీయ స్థాయిలో టాప్‌-10లో నిలిచింది.

Students make women safety device
మహిళా భద్రతా పరికరాన్ని తయారు చేసిన విద్యార్థినులు
author img

By

Published : Dec 27, 2021, 3:40 PM IST

students make women safety device: ఏపీలోని విశాఖ జిల్లా మధురవాడ రిక్షా కాలనీ ఏపీ బాలయోగి గురుకుల ప్రతిభ పాఠశాల, కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు మహిళా భద్రతా పరికరం ‘ఉమెన్‌ సేఫ్టీ డివైజ్‌’ను రూపొందించి ‘అటల్‌ ఇన్నోవేషన్‌ మారథాన్‌’కు ఏపీ నుంచి ఎంపికయ్యారు.

Atal innovation mission: సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంశాలను తీసుకుని వాటికి పరిష్కార మార్గాలను చూపే ఆవిష్కరణలకు రూపకల్పన చేసేలా అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (నీతి ఆయోగ్‌) ఆన్‌లైన్‌లో ప్రాజెక్టులను ఆహ్వానించగా 9 వేల మంది విద్యార్థులు రెండు దశల్లో 1100 నమూనాలతో పోటీ పడ్డారు. వాటిల్లో ఉత్తమమైన 150 నమూనాలను ఎంపిక చేసి, అత్యుత్తమమైన 30 ప్రాజెక్టులకు ఇంటర్న్‌షిప్‌ (ప్రశిక్షన్‌) ఇచ్చేందుకు డెల్‌ టెక్నాలజీ, లెర్నింగ్‌ లింక్‌ ఫౌండేషన్‌, నీతిఆయోగ్‌ శ్రీకారం చుట్టాయి.

  • ఆ 30 ప్రాజెక్టుల్లో ఏపీ నుంచి గురుకులంలో 9వతరగతి చదువుతున్న కె.జెస్సికా, కె.ప్రవల్లిక, పదో తరగతికి చెందిన ఎం.స్వాతిలు గైడ్‌ టీచర్‌ టి.రాంబాబు సారథ్యంలో రూపొందించిన ‘మహిళా భద్రతా పరికరం’ ఎంపికై జాతీయస్థాయిలో టాప్‌-10లో నిలిచింది.

తోడు.. నీడగా..

మహిళా, బాలికల వసతి గృహాల్లో రక్షణ కోసం ఈ పరికరాన్ని వారు రూపకల్పన చేశారు. పీసీబీ బోర్డు, మోడ్‌ఎంసీయూ, మెక్రోట్రాన్స్‌ఫార్మర్‌, పానిక్‌ బటన్‌లతో టచ్‌ సెన్సార్లతో ఏర్పాటు చేశారు. దీన్ని బ్లింక్‌ యాప్‌ ద్వారా చరవాణులకు అనుసంధానం చేశారు. ఆ పరికరంలో బ్లూ, గ్రీన్‌, రెడ్‌ పానిక్‌ బటన్‌లను అమర్చారు.

  • అగ్నిప్రమాదాలు సంభవించినా, వసతిగృహాల్లో నీరు అందుబాటులో లేకపోయినా బ్లూబటన్‌, అత్యవసర ఆరోగ్య సమస్యలు వస్తే గ్రీన్‌ బటన్‌, అపరిచిత వ్యక్తులు వస్తే రెడ్‌ బటన్‌ టచ్‌ చేస్తే జీపీఎస్‌ ద్వారా అలర్ట్‌ మెసేజ్‌ ప్రిన్సిపల్స్‌, వార్డెన్లు, సెక్యూరిటీ గార్డులు, దిశ పోలీసులకు, సమీప ఆసుపత్రుల నిర్వాహకుల చరవాణులకు వెళ్లేలా రూపకల్పన చేశారు.
  • ఈ పరికరం జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, కాపీరైట్‌, పేటెంట్‌ దిశగా అడుగులు పడడం, ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక కావడంతో విద్యార్థినులతో పాటు గైడ్‌ టీచర్‌ టి.రాంబాబును గురుకులాల సమన్వయకర్త ఎస్‌.రూపవతి, ప్రిన్సిపల్‌ ఎస్‌.వి.రమణ, వైస్‌ప్రిన్సిపల్‌
    రామ్‌ప్రసాద్‌లు అభినందించారు.
-ప్రవల్లిక, 9వతరగతి

మరింతగా తీర్చిదిద్దుతాం..

ఎన్నో సమస్యలతో సతమతమయ్యే మహిళలు, బాలికలకు తోడుగా నిలవాలనే లక్ష్యంతో ఈ పరికరాన్ని రూపొందించాం. దాన్ని మరింతగా తీర్చిదిద్ది అందరికీ ఉపయోగపడేలా చేస్తాం.- ప్రవల్లిక, తొమ్మిదో తరగతి విద్యార్థిని

-టి.రాంబాబు, ఏటీఎల్‌ ల్యాబ్‌ ఇన్‌ఛార్జ్‌, ఏపీ బాలయోగి గురుకులం, మధురవాడ

ఏటీఎల్‌ మిషన్‌ సహకారం మరువలేనిది..

శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణల దిశగా ఏటీఎల్‌ మిషన్‌ చేస్తున్న కృషి అభినందనీయం. మా గురుకులంలో విద్యార్థుల్లో సృజనాత్మకతను సహచర అధ్యాపక బృందంతో కలిసి గుర్తించి వారి జిజ్ఞాసకు ప్రోత్సాహం అందిస్తున్నాం.- టి.రాంబాబు, ఏటీఎల్​ ల్యాబ్​ ఇంఛార్జ్​, మధురవాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.