ETV Bharat / city

అనిశా అధికారులు దూకుడు... అవినీతిపరుల గుండెల్లో గుబులు

అవినీతిపరులపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) కొరడా ఝుళిపిస్తోంది. వరుస దాడులతో దూకుడుగా దూసుకుపోతుంది. గతం కంటే భిన్నంగా దాడులు నిర్వహిస్తూ... లంచగొండులతో పాటు ఇచ్చిన వాళ్లను సైతం వదలడం లేదు. పక్కా ఆధారాలతో సహా అక్రమార్కులను పట్టుకుంటూ... ఊచలు లెక్కపెట్టేలా చేస్తోంది. సమాచార వ్యవస్థను పటిష్ఠం చేసుకుంటూ అడుగులు ముందుకేస్తోంది. ఏ స్థాయి అధికారులైనా సరే... దాడులు చేస్తూ అవినీతిని బట్టబయలు చేస్తోంది.

anti corruption bureau resolved stories in telangana

author img

By

Published : Oct 6, 2020, 4:00 PM IST

ఏసీబీ వరుస దాడులతో అవినీచిపరులకు దడ పుట్టిస్తోంది. ఉన్నతాధికారులైనా సరే... వారి అక్రమాల గురించి సమాచారం అందితే చాలు ప్రత్యేక కార్యాచరణతో ఆధారాలన్నీ అనిశా అధికారులు సేకరిస్తున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగి అవినీతి పరుల అక్రమాలను బయటపెడుతున్నారు.

కోట్లకు కోట్లే మింగేస్తున్న తిమింగలాలు...

ఇటీవల కాలంలో మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, కీసర తహసీల్దార్‌ నాగరాజు కేసుల్లో ఏసీబీ పకడ్బందీగా వ్యవహరించి అన్ని ఆధారాలను సేకరించి... ఇద్దరు లంచగొండి అధికారుల తీరును బయటపెట్టింది. ఈ ఇద్దరు అధికారులు తీసుకున్న లంచం మొత్తం చూసి అనిశా అధికారులే విస్తుపోయారు. మెదక్‌ జిల్లా సర్వాపూర్‌ మండలం చిప్పలతుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు అనదపు కలెక్టర్​ నగేశ్​... ఎకారానికి లక్ష రూపాయలు చొప్పున మొత్తం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్‌ చేశాడు. డిమాండ్‌ చేసిన మొత్తంలో 40 లక్షలు తీసుకున్నాడు. బాధితుడి దగ్గర నుంచి ఐదెకరాల స్థలం రాయించుకున్నాడు.

పక్కా ఆధారాలతో...

ఇంత చేసి తనకు డబ్బు, స్థలం ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియదంటూ బుకాయించాడు. అనిశా అధికారులు ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ... ఇదే సమాధానం చెప్పాడు. చెక్కులు, స్థలం పత్రాలు జిల్లా మాజీ కలెక్టర్‌ ధర్మారెడ్డి వద్ద ఉండవచ్చేమోనన్నాడు. సోదాల నేపథ్యంలో తన నివాసంలోనే చెక్కులు, దస్త్రాలు ఏసీబీ విచారణ బృందం స్వాధీనం చేసుకోగా నగేశ్​ కంగుతిన్నాడు. ఈ తతంగంలో భాగస్వామ్యులైన సర్వేయర్‌ వసీం, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ సత్తార్‌, బినామీ జీవన్‌గౌడ్‌ను పక్కా ఆధారాలతో ఏసీబీ అరెస్టు చేసింది.

ఫిర్యాదు ఉంటేనే కాదు.. అనుమానమొచ్చినా...

మరో కేసులో భూవివాదానికి సంబంధించి అనుకూల దస్త్రాలు ఇచ్చేందుకు కీసర తహసీల్దార్‌ నాగరాజు ఏకంగా 1.10 కోటి తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ కేసులో ఫిర్యాదుదారులెవరూ లేనప్పటికీ... పకడ్భందీగా వ్యవహరించిన ఏసీబీ నాగరాజుకు లంచం ఇచ్చిన స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్‌తో పాటు వీఆర్‌ఏ సాయిరాజ్‌ను అరెస్టు చేశారు.

తెర వెనక ఉండే వ్యవహారం...

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డిని అన్ని ఆధారాలతో అనిశా అధికారులు పట్టుకున్నారు. సోదాల సందర్భంగా ఆయన వద్ద రూ.75 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. అయితే మాదాపూర్‌లో నర్సింహారెడ్డి తెర వెనుక ఉండి రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఈ అంశాన్ని ఏసీబీ వెలుగులోకి తెచ్చింది.

ప్రతీ శాఖలోనూ అవినీతి చేపలు..

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్య, ఏఎస్‌ఐ రాజేందర్‌ లక్షా ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఇద్దరు అధికారులు... సూపరింటెండెంట్‌ లక్ష్మణ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ విపిన్‌ ఘట్‌కేసర్‌లోని ఓ పాఠశాలలో స్టేట్‌ సిలబస్‌ను... సీబీఎస్‌ఈగా మార్చడానికి యాజమాన్యం వద్ద నుంచి రూ.40 వేలు లంచంగా డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. మరో కేసులో రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్‌ రఘునాథ్‌ అనిశాకు దొరికిపోయాడు. పంటి ఆసుపత్రి పరిమితులు రెన్యువల్‌ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. భూమికి సంబంధించిన సర్వే నివేదిక ఇవ్వడానికి భూ యజమాని నుంచి 5 వేలు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ సర్వేయర్, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఫిర్యాదు చేస్తే చాలు వలతో వాలిపోతాం...

అధికారులు లంచం స్వీకరించే సమయంలో అనిశా అధికారులు ఆ దృశ్యాలను చరవాణుల్లో, కెమెరాల్లో బంధించి వాటిని ఆధారాలుగా చూపుతున్నారు. ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వడమూ తీసుకోవడమూ రెండు నేరాలే. లంచం డిమాండ్‌ చేసే అక్రమార్కుల గురించి అనిశా టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1064 కు ఫోన్‌ చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: నకిలీ పోలీసు మోసం.. రూ.9 లక్షలు వసూలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.