Special Trains For Ayyappa Devotees : ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల కొండకు వెళ్తున్న భక్తులకు శుభవార్త. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సౌత్ సెంట్రల్ రైల్వే విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ నుంచి కొల్లం, కొట్టాయంలకు పెద్ద సంఖ్యలో స్పెషల్ ట్రైన్స్ సర్వీసులను ఏర్పాటు చేసింది.
ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకు వివిధ తేదీల్లో విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కొల్లంకు 44 స్పెషల్ ట్రైన్స్ సర్వీసులు అందించనున్నాయి. వీటిలో వైజాగ్ - కొల్లం - విశాఖ ప్రత్యేక రైళ్లు (08539/08540) డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 27 వరకు 26 సర్వీసులు అందించనున్నాయి. విశాఖ - కొల్లం స్పెషల్ ట్రైన్ (08539) ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయల్దేరి గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లం స్టేషన్కు చేరుకోనుంది. కొల్లం - విశాఖ రైలు (08540) డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి గురువారం కొల్లంలో రాత్రి 7.35 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 11.20 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.
అలాగే, శ్రీకాకుళం రోడ్ - కొల్లం - శ్రీకాకుళం రోడ్ మధ్య కొత్తగా 18 సర్వీసులు నడపనున్నారు. వీటిలో శ్రీకాకుళం రోడ్ - కొల్లం నడుమ డిసెంబర్ 1 నుంచి జనవరి 27 వరకు సర్వీసులందించే ప్రత్యేక రైలు (08553) ప్రతి సోమవారం మార్నింగ్ 6 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో బయల్దేరి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే, రిటర్న్ జర్నీలో 08554 రైలు ప్రతి సోమవారం కొల్లంలో సాయంత్రం 4.30గంటలకు బయల్దేరి, బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు శ్రీకాకుళం స్టేషన్ (ఆమదాలవలస) చేరుకోనుంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ మధ్య డిసెంబర్ 5 నుంచి 27 వరకు ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ స్పెషల్ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. కాచిగూడ - కొట్టాయం (07133) రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (ప్రతి గురువారం) మధ్యాహ్నం 3.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బయల్దేరి శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయం చేరుకోనుంది. డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి శుక్రవారం) స్పెషల్ ట్రైన్ (07134) రాత్రి 8.30 గంటలకు కొట్టాయంలో బయల్దేరి మరుసటి రోజు (శనివారం ) రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరనుంది. ఇకపోతే, హైదరాబాద్ కొట్టాయం - సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 3 నుంచి జనవరి 1 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు కొనసాగించనున్నాయి. హైదరాబాద్ - కొట్టాయం (07135) ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.10 గంటలకు కొట్టాయం స్టేషన్కు చేరుకోనుంది. అలాగే, కొట్టాయం - హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ (07136) బుధవారం సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో స్టార్ట్ అయి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్ చేరుకోనుంది.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఆ తేదీల్లో కాచిగూడ నుంచి 4 ప్రత్యేక రైళ్లు