ETV Bharat / city

అంతర్వేదిలో వైభవంగా తిరు కల్యాణం - అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వార్తలు

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణ మహోత్సవం వైభవోపేతంగా సాగింది. వేద ఘోష, గోవింద నామ స్మరణలతో గోదావరి సాగర సంగమ తీర్థం మార్మోగింది. శాస్త్రోక్తంగా నిర్వహించిన కల్యాణ ఘట్టాలను భక్తులు తిలకించారు.

antharvedi-lakshinarasimha-swamy-kalyanostavam
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణ మహోత్సవం
author img

By

Published : Feb 23, 2021, 9:12 AM IST

ఏపీలో.. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్య కల్యాణోత్సవం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. కల్యాణోత్సవంతో.. అంతర్వేదిలో ఆధ్యాత్మికత విరాజిల్లింది. పంచగరుడ ఆంజనేయ స్వామి వాహనం, కచుగరుడ వాహనంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్ల విగ్రహాలను మాఢవీధుల్లో ఊరేగించారు. ఎదురుకోళ్ల వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపారు.

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణ మహోత్సవం
antharvedi-lakshinarasimha-swamy-kalyanostavam
కల్యాణ ఘట్టం.. అద్వితీయం

అనంతరం భూదేవి, శ్రీదేవి సమేత స్వామివార్ల ఉత్సవ మూర్తుల్ని కల్యాణ మండప వేదికపై ప్రతిష్టింపజేశారు. కళ్యాణ మహోత్సవంలోని ప్రతి ఘట్టం విశిష్టతను అర్చకులు వివరిస్తూ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్ర యుక్త తులా లగ్న పుష్కరాంశ ముహూర్తంలో 11 గంటల 19 నిమిషాలకు దేవతా మూర్తులకు జీలకర్ర బెల్లం పెట్టారు.

కన్నులపండువగా స్వామి కల్యాణం

కల్యాణం.. కమనీయం

బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ, ఏసీపీ కుమార్‌... రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంగళ ధారణ, తలంబ్రాల వేడుక కన్నులపండువగా జరిపించారు.

నయనానందకరంగా సాగిన లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని తిలకించి భక్తకోటి తరించారు. మంగళవారం మధ్యాహ్నం రథోత్సవం నిర్వహించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.