ETV Bharat / city

Antarvedi woman: ఐరాస ఆన్​లైన్ సదస్సుకు.. అంతర్వేది మహిళ! - అంతర్వేది మహిళకు అరుదైన గౌరవం

ఈ నెల 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో జరిగే సదస్సులో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన గ్రీన్‌వార్మ్స్‌ సభ్యురాలు తాడి దీపికకు అవకాశం దక్కింది. ఐక్యరాజ్యసమితి సముద్ర విభాగం ప్రతినిధులు ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆమె నుంచి వీడియో ద్వారా సేకరించారు.

ఐరాస ఆన్​లైన్ సదస్సుకు.. అంతర్వేది మహిళ!

author img

By

Published : Jun 6, 2021, 8:12 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన దీపిక అనే మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి సమితి ఆధ్వర్యంలో ఈ నెల 8న మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో జరిగే సదస్సులో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ మేరకు గ్రీన్‌వార్మ్స్‌ ప్రతినిధి అక్షయ్‌ గుండేటి, సఖినేటిపల్లి మండలం కో-ఆర్డినేటర్‌ గంటా సునీల్‌ శనివారం వెల్లడించారు.

గోదావరి సముద్రతీర ప్రాంతాల్లో కాలుష్య నివారణకు గ్రీన్‌వార్మ్స్‌, స్మార్ట్‌విలేజ్‌ మూవ్‌మెంట్‌ సంస్థల ఆధ్వర్యంలో అంతర్వేదిలో 'జీరో వేస్ట్‌- అంతర్వేది' ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా సాగర సంగమం, దేవాలయాలు, గ్రామ పరిసర ప్రాంతాల నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి కాలుష్య నివారణ చేయడమే లక్ష్యంగా దీపికతో పాటు మరో నలుగురు మహిళలను గ్రీన్‌వార్మ్స్‌ సభ్యులుగా చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తీరంలో కాలుష్య నివారణతో పాటు జీవరాశుల మనుగడ, జాలర్ల జీవనోపాధి వంటి విషయాలపై దీపిక మాటలతో ఓ వీడియో తీసి గ్రీన్‌వార్మ్స్‌ సంస్థ సభ్యులు ఐక్యరాజ్యసమితికి పంపించారు. ఇలా ప్రపంచంలో పలు దేశాల నుంచి వచ్చిన అంశాలను పరిశీలించిన ఐక్యరాజ్యసమితి మొత్తం 30 మందిని ఎంపిక చేసుకోగా.. అందులో మన దేశం నుంచి దీపికకు అవకాశం దక్కింది.

ఇదీ చదవండి: Corona: కరోనాపై పోరాటంలో క్రీడామణులు.. తమ వంతుగా పేదలకు సేవలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.