ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు (Jagan's bail revocation) కోరుతూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టు (CBI COURT)లో మరోసారి విచారణ చేసింది. ఈనెల 8న జగన్, రఘురామకృష్ణరాజు తమ వాదనలను లిఖిత పూర్వకంగా న్యాయస్థానానికి సమర్పించారు. ఈ విషయమై మరోసారి వాదనలు కొనసాగాయి.
వైఖరి మార్చుకున్న సీబీఐ... లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని.. అందుకోసం 10 రోజులు గడువు కావాలని ధర్మాసనాన్ని కోరింది. సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందని.. ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ నెల 26కు విచారణను వాయిదా వేసింది.
ఈనెల 8న విచారణలో అంశాలు..
ఈనెల 8న జగన్, రఘురామ కృష్ణరాజు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు. సీబీఐ మాత్రం వాదించేది ఏదీ లేదని.. పిటిషన్లోని అంశాలను చట్టపరిధిలో, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. జగన్ వాదనలపై సమాధానాలు ఇచ్చేందుకు రఘురామ కృష్ణ రాజు తరఫు న్యాయవాది సమయం కోరడంతో నేటికి వాయిదా పడింది.
ఇదీ చదవండి: KTR: ఈటలకు తెరాసలో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలి: కేటీఆర్