ఏపీ రాజధాని అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. తాళ్లాయపాలెం వాసి కొండేపాటి పెద్ద పకీరయ్య గుండెపోటుతో మరణించారు. అమరావతి నిర్మాణానికి పకీరయ్య మూడు ఎకరాల పొలం ఇచ్చారు. కొంత కాలంగా తీవ్ర వేదనతో ఉన్న పకీరయ్య.. గుండెపోటుతో కన్నుమూశారు.
మందడం దీక్షా శిబిరంలో పిల్లలతో కలిసి అమరావతి ఉద్యమంలో రోజూ పాల్గొనేవారు. రైతు దినోత్సవం రోజున అన్నదాత ప్రాణాలు కోల్పోవడంతో తోటి కర్షకులు కన్నీటి పర్యంతమయ్యారు.
![amaravthi farmer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9974664_298_9974664_1608693857479.png)
ఇదీ చదవండి: వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే: నిరంజన్‌రెడ్డి