ETV Bharat / city

ANIMAL LOVER: శునకాలపై కానిస్టేబుల్​ ప్రేమ.. రోజూ 350 కుక్కలకు బిర్యానీ, పరమాన్నం..​ - జంతు ప్రేమికులు

ఆయన జంతు ప్రేమికుడు. శునకాలంటే వల్లమాలిన అభిమానం. ఇంట్లో పదుల కొద్దీ వీధి కుక్కలను పెంచుతున్నారు. నిత్యం నేర పరిశోధన, కేసులతో బిజిబిజీగా ఉండే ఆయన.. రెండు దశాబ్దాలకుపైగా మూగజీవుల ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

animal-loving-police-family-feeding-street-dogs-in-anantapur-district

author img

By

Published : Oct 3, 2021, 5:05 PM IST

ANIMAL LOVER: శునకాలపై కానిస్టేబుల్​ ప్రేమ.. రోజూ 350 కుక్కలకు బిర్యానీ, పరమాన్నం..​

ఏపీలోని అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో.. వెంకటేష్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో తాను పనిచేసిన చోట శునకాలు ఆకలితో ఉండటం చూసి చలించిపోయారు. ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారంలో సగ భాగం శునకాలకే పెట్టేవారు. అప్పటి నుంచి మొదలైన శునక సేవ.. 22 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది.

శునకాల కోసం వెంకటేష్ తన ఇంట్లోని ఓ గదిని పూర్తిస్థాయి వంటశాలగా మార్చేశారు. భార్య జయమ్మ, మరో సహాయకుడి ద్వారా రోజూ 350 శునకాలకు బిర్యానీతోపాటు పరమాన్నం వండుతున్నారు. వంట పూర్తి కాగానే కవర్లలో నింపుకొని... దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్లి వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నారు. వెంకటేష్ వాహన శబ్ధం వినగానే కుక్కలు వాహనాన్ని చుట్టుముడతాయి. శునకాల కడుపు నింపటానికి జయమ్మ, వెంకటేష్ జంట నెలకు 30 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

శునకాల ఆకలి తీర్చటమే కాదు.. వాటి బాగోగులూ వెంకటేష్‌ చూసుకుంటున్నారు. అనారోగ్యం బారినపడిన వాటిని పశువైద్యుడికి చూపించి అవసరమైన మందులు కొనుగోలు చేస్తూ సంరక్షిస్తున్నారు. వీధి కుక్కల క్షుద్బాధ తీరుస్తున్న కానిస్టేబుల్‌ దంపతులపై ప్రశంసలు కురుస్తున్నాయి. - త్యాగరాజు, విశ్రాంత ఏఎస్సై

కానిస్టేబుల్‌ వెంకటేష్‌కు ఉన్నత అధికారుల దగ్గర ప్రత్యేక గుర్తింపు ఉంది. విధుల్లో అంకిత భావం, నిజాయతీని గుర్తించి వెంకటేష్‌కు అనేక అవార్డులు, రివార్డులు ఇచ్చారు. త్వరలో పదవీ విరమణ పొందనున్న వెంకటేశ్‌.. పింఛన్‌లో సగం సొమ్ము తప్పనిసరిగా శునకాల కోసం ఖర్చుచేస్తానని చెబుతున్నారు. - వెంకటేష్, కానిస్టేబుల్

విశ్వాసానికి మారుపేరైన శునకాల ఆకలి తీరుస్తున్న వెంకటేష్ ఇప్పటి వరకు ఎవరి నుంచి విరాళం తీసుకోలేదు. సొంత డబ్బుతోనే వీధి కుక్కలకు సేవలందిస్తున్నారు. దాతలు సహాయం చేస్తే ఇంకా ఎక్కువ శునకాలకు ఆహారం అందిస్తానని ఆయన అంటున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.