ETV Bharat / city

రాష్ట్రంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న లంపీస్కిన్‌ వ్యాధి - Lumpyskin disease in cattle in Telugu states

Lumpy skin disease is spreading in Telangana:తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో లంపీస్కిన్‌ వ్యాధి ప్రబలుతోంది. ఉత్తరభారతంలో వణిస్తున్న ఆ వ్యాధి వల్ల పశువుల ఆరోగ్యం, పాల దిగుబడిపై ప్రభావం చూపుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా ఆవు, గేదె జాతి పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి కేసులు వెలుగు చూస్తుండటంతో నివారణ కోసం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో 22 జిల్లాల్లో 255 గ్రామాల్లో లంపీస్కిన్ వ్యాధి ప్రభావం కనిపిస్తుండటంతో పశుసంవర్థక శాఖ టీకాల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 1, 2022, 10:19 AM IST

రాష్ట్రంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న లంపీస్కిన్‌ వ్యాధి

Lumpy skin disease is spreading in Telangana: తెలుగురాష్ట్రాల్లోని పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి ఎల్ఎస్​డీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ముద్ద చర్మ వ్యాధి కేసులు నమోదవుతుండటంతోపాటు.. 80 వేలకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి ఆ వ్యాధి ప్రవేశించడం ద్వారా ఆవు, గేదె జాతి పశువుల్లో తీవ్రప్రభావం చూపుతోంది.

జాగ్రర్త చర్యలు: ప్రాణాంతక లంపీస్కిన్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వ్యాధినిరోధక చర్యలకు ఉపక్రమించాయి. రోగ లక్షణాలు గల పశువులను గుర్తించి పశు వైద్యులు టీకాలు వేస్తున్నారు. ఇతరరాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన పశువుల్లో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదా అనారోగ్యంగా ఉన్న ఆవులు, గేదెలకు తగిన చికిత్స అందిస్తూ ఐసోలేషన్‌లో పెట్టి మిగతా మందలో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టీకాతో అరికట్టవచ్చు: సాధారణంగా వ్యాధి విస్తరించిన తర్వాత నివారణ కష్టం. ఐసీఏఆర్​ అనుబంధ పిస్తార్ బరేలీ జాతీయ పశు పరిశోధన సంస్థలు సంయుక్తంగా లంపీ ప్రోవ్యాక్స్ ఇండ్ పేరిట టీకా రూపొందించినట్లు సెప్టెంబరు 10న మోదీ సర్కారు ప్రకటించింది. ఐతే ఆ టీకా ఇప్పుడు అందుబాటులోకి వచ్చే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా చేయడంతోపాటు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం వల్ల ముద్దచర్మ వ్యాధిని అరికట్టవచ్చని పాడిరంగ నిపుణులు సూచిస్తున్నారు.

ఔషధాల కోసం ప్రభుత్వం 15 కోట్ల మంజూరు: ఉత్తరాది రాష్ట్రాల్లో కేసులు వెలుగు చూస్తున్న ఆరంభంలో తెలంగాణప్రభుత్వం మందస్తుగా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పశుసంవర్థక శాఖ విజ్ఞప్తి మేరకు ఔషధాల కోసం ప్రభుత్వం 15 కోట్ల మంజూరుకు అనుమతిచ్చింది. గతంలో 3 కోట్లు వెచ్చించింది. సాధారణంగా ఒక పశువుకు లంపీస్కిన్‌ వ్యాధి బారినపడితే దానికి టీకా ఇచ్చి ఐసోలేషన్‌లో ఉంచి చుట్టు పక్కల 5 కిలోమీటర్ల దూరం వరకు పశువులకు రింగ్ వ్యాక్సినేషన్‌ చేపట్టింది. రాష్ట్రంలోని పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి అదుపులో ఉందని పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ ఎస్.రాంచందర్ స్పష్టం చేశారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 నుంచి 17 లక్షల పశువులకు ఈ వైరస్ సోకిన దృష్ట్యా ఈ వ్యాధి మరింత విస్తరిస్తే పాడి పరిశ్రమకు తీవ్ర వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కడైనా పశువుల్లో లక్షణాలు కనిపించినట్లైతే.. రైతులు నేరుగా టోల్‌ఫ్రీ నంబరు 1961 ఫోన్‌ చేయడం ద్వారా మొబైల్ వెటర్నరీ క్లీనిక్‌ల సేవలు అందిపుచ్చుకోవాలని పశుసంవర్థక శాఖ విజ్ఞప్తి చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.