ETV Bharat / city

ఏ ఫొటోనైనా కోరినట్లు మార్చగలడు..! - karan acharya's photo editing

గుర్రం మీద కూర్చుని ఉన్న ఈ కాలం పాప ఫొటో ఒకటి, ఆ పక్కనే కోట వెలుపల అశ్వం మీద స్వారీ చేస్తున్న చిన్నారి ఝాన్సీలక్ష్మీబాయి చిత్రం మరొకటి...  కారులో తండ్రి ఒడిలో కూర్చున్న చిన్నితండ్రి ఫొటో ఒకటి, పక్కనే పౌరుషానికీ పరాక్రమానికీ ప్రతిరూపమైన ఛత్రపతి శివాజీ ఆయన వారసుడూ ఉన్న చిత్రం ఇంకొకటి... ఇక్కడున్న రెండు ఫొటోల్లోనూ మనుషులు ఒకేలా ఉన్నా వారి కాలాలు వేరు. వేషధారణ వేరు. మరి, ఇదెలా సాధ్యమైందీ అంటే... అంతా కరణ్‌ ఆచార్య చేసిన ఫొటో ఎడిటింగ్‌ మాయ.

Angry Hanuman sticker inventor karan acharya
ఏ ఫొటోనైనా కోరినట్లు మార్చగలడు..!
author img

By

Published : Sep 6, 2020, 2:13 PM IST

రణ్‌ ఆచార్య... చాలామందికి ఈ పేరు తెలియకపోవచ్చు. కానీ అతడు గీసిన ‘యాంగ్రీ హనుమాన్‌’ యానిమేషన్‌ స్టిక్కర్లని మాత్రం చూడని వారుండరు. దేశవ్యాప్తంగా కార్లూ బైక్‌ల మీద ఎక్కడ చూసినా హనుమంతుడు కోపంగా చూస్తున్నట్లున్న ఈ స్టిక్కర్లే కనిపిస్తున్నాయి మరి. టీషర్టులూ వాచ్‌లూ ఫోన్‌లూ ల్యాప్‌టాప్‌లలాంటి వాటిమీదికీ చేరి ఈ బొమ్మ ఫ్యాషన్‌ సింబల్‌గానూ మారడంతో ప్రధాని మోదీ కూడా మంగళూరు వచ్చినపుడు కరణ్‌ ఆచార్యను యూత్‌ ఐకన్‌గా అభివర్ణించారు.

ఇక, ప్రస్తుత విషయానికొస్తే ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు అతడు ఫొటోఎడిటింగ్‌ చేసినవి. కొన్ని రోజుల కిందట ఓ చిన్నారి ఫొటోను బాల కృష్ణుడు కాళీయ మర్దనం చేస్తున్నట్లు మార్చి 2.5 లక్షల ఫాలోవర్లు ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు కరణ్‌. దానికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. కొందరు అభిమానులు అతడిని మెచ్చుకోవడంతోనే ఆగకుండా ‘మా బుజ్జిగాడి ఫొటోను కూడా కృష్ణుడిలా మారుస్తారా..? మా పాపాయిని ఝాన్సీలక్ష్మీబాయిలా చూపించగలరా..?’ అంటూ ఇన్‌స్టా, ట్విటర్లలో కరణ్‌కి మెసేజ్‌లు పెట్టారు. వాళ్లు కోరినట్లే ఫొటోలను ఎడిట్‌ చేసి కరణ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో అవికాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోయాయి.

ఒకరి తల ఇంకొకరికి పెట్టడం, బ్యాగ్రౌండ్‌ మార్చడం లాంటివి చాలామంది చెయ్యగలరు. కానీ మామూలు ప్యాంటూ షర్టూ వేసుకున్న పిల్లాడికి కాషాయ వస్త్రాల్ని అందంగా చుట్టి, చేతిలో ధనుస్సుని పెట్టి అయోధ్యలో రాముడిలా చూపించడం, టీషర్టు వేసుకుని కార్లో కూర్చున్న వ్యక్తిని రాచఠీవితో రాజమందిరంలో ఆశీనుడైన ఛత్రపతి శివాజీలాగా మార్చడం... సరదాగా గుర్రంమీద కూర్చున్న పాప ఫొటోను పరాక్రమశాలి అయిన ఝాన్సీలక్ష్మీబాయిగా తీర్చిదిద్దడం... సాధారణ విషయం కాదు. పైగా ఆయా చిత్రాలకు చక్కగా సరిపోయే బ్యాగ్రౌండ్‌ని డిజైన్‌ చెయ్యడం కూడా గొప్ప విషయమే.

ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... వీటిలో కొన్ని ఫొటోలు సగం వరకే ఉన్నా వాటిని పూర్తిగా కనిపించేలా డిజైన్‌ చేసి ఆయా చిత్రాలను మరింత సహజంగా ఆకట్టుకునేలా చేశాడు. ఇంకేముందీ... ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండడంతో కరణ్‌ మరోసారి వార్తల్లోకెక్కేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.