ETV Bharat / city

Angel Fish: మత్స్యకారులకు చిక్కిన 'సానిపాప'

Angel Fish: ఓ అరుదైన చేప పూడిమడక మత్స్యకారులకు చిక్కింది. చూడటానికి ఎంతో అందంగా ఉన్న దీని పేరు ఏంజెల్.. కానీ అక్కడి స్థానికులు 'సానిపాప'గా పిలుస్తారు.

Angel Fish
Angel Fish
author img

By

Published : Apr 24, 2022, 2:21 PM IST

Angel Fish: అరుదైన చేప ఏపీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు చిక్కింది. ఏంజెల్‌ అనే ఈ చేపను స్థానికులు ‘సానిపాప’గా పిలుస్తారు. అడుగు పొడవున్న చేపను స్థానిక మార్కెట్​లో రూ.200లకు విక్రయించినట్లు మత్స్యకారులు తెలిపారు. ఇవి సముద్రం అడుగున రాళ్ల మధ్య తిరుగుతూ.. అరుదుగా ఉపరితలానికి వస్తుంటాయి.

ఆ సమయంలో వలలకు చిక్కుతాయి. చూడటానికి అందంగా ఉన్నా.. రుచి తక్కువగా ఉండటంతో ఎక్కువమంది కొనేందుకు ఇష్టపడరు. సాధారణంగా ఇవి 5 కిలోల వరకు పెరుగుతాయని, ప్రోమోకాట్స్‌ వీటి శాస్త్రీయనామం అని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి తెలిపారు.

ఇవీ చదవండి: ఈ-బైక్స్​లో మంటలు.. ఆ స్కూటర్లన్నింటినీ వెనక్కి పిలిపిస్తున్న ఓలా

ఛార్జీలు పెంచినా... ఆర్థిక సంక్షోభంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.