ETV Bharat / city

నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: ఏపీ సీఎం జగన్‌ - నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: ఏపీ సీఎం జగన్‌

నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: ఏపీ సీఎం జగన్‌

author img

By

Published : Mar 4, 2022, 1:44 PM IST

11:50 March 04

నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్​ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. ఏపీ సీఎం జగన్‌తో కలిసి ఆయన పోలవరం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఇందుకూరు-1లో ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కాలనీ, ఏనుగులగూడెంలో పోలవరం నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నిర్వాసితుల పునరావాస కాలనీని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో షెకావత్‌ మాట్లాడారు.

ఈ సందర్భంగా నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చాల్సిన అవసరం ఉందని షెకావత్​ పేర్కొన్నారు. పునరావాస కాలనీని పరిశీలించానని.. వసతులు బాగున్నాయని అన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి చెప్పారు.

నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: జగన్‌

ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని..కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు తీసుకుని దీన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ పేర్కొన్నారు. పునరావాస పనులపై అధికారులు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే.. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. నిర్వాసితులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని జగన్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. జగన్​ అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా 1000 రోజులు పూర్తవుతోంది.

ఇదీ చూడండి: ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ చేరుకున్న సీఎం కేసీఆర్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.