ETV Bharat / city

Neet rank 2021: నీట్​లో మెరిసిన ఎమ్మెల్యే కుమార్తె.. - తెలంగాణ వార్తలు

జాతీయ వైద్య విద్య పరీక్ష(నీట్​)లో ఏపీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుమార్తె ప్రతిభ చాటారు. ఎస్సీ కేటగిరిలో 40, ఓపెన్​ కేటగిరిలో 2050 ర్యాంకును సాధించారు.

Neet rank 2021, ap mla daughter neet rank
ఎమ్మెల్యే కుమార్తెకు నీట్ ర్యాంకు, నీట్ ర్యాంకులు 2021
author img

By

Published : Nov 3, 2021, 12:10 PM IST

జాతీయ వైద్య విద్య పరీక్ష (నీట్‌)-2021లో ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి కుమార్తె విజయ వెంకట భవ్య మంచి ర్యాంక్ సాధించారు. ఎస్సీ కేటగిరిలో 40... ఓపెన్‌ కేటగిరిలో 2050 ర్యాంకుతో ప్రతిభ చాటారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే శ్రీదేవి తన కుమార్తెకు కేకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... కష్టపడి చదివితే ర్యాంకులు వస్తాయని, దేవుడి ఆశీసులతో తన బిడ్డ మరింత ఉన్నత స్థాయికి చేరి ఏపీకి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో తన కుమార్తెకు మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉందన్నారు.

విజయవెంకట భవ్య మాట్లాడుతూ... తన తల్లి వైద్యురాలు కావడంతో చిన్నప్పటి నుంచి తనకు వైద్య విద్యపై మక్కువ పెరిగిందని తెలిపారు. ఆమె సూచనలతో కష్టపడి చదివి పరీక్ష రాశానని చెప్పారు. మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆమెకు కుటుంబ సభ్యులు, వైకాపా నాయకులు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: Etela Rajender Speech: 'కేసీఆర్‌ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయమిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.