ETV Bharat / city

PERNI NANI: 'సినిమా టికెట్లపై దుష్ప్రచారాలు మానుకోండి'

సినిమా టికెట్లను ఏపీ ప్రభుత్వం విక్రయించనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

PERNI NANI, movie tickets sales in ap
ఏపీ మంత్రి పేర్ని నాని, ఏపీలో సినిమా టికెట్ల అమ్మకం
author img

By

Published : Sep 14, 2021, 4:26 PM IST

సినిమా టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విక్రయించనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ విషయంలో జగన్ ప్రభుత్వంపై విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అమరావతిలో స్పష్టం చేశారు అంశంపై కమిటీలు వేశామని.. అధ్యయనం జరుగుతోందని ఆయన చెప్పారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం మంచి పని ఏది చేపట్టినా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మాలని సినీ ప్రముఖులే కోరారని.. సినీ పెద్దల సూచనలనే తమ ప్రభుత్వం పరిశీలించిందని ఏపీ మంత్రి స్పష్టం చేశారు. పన్ను ఎగవేత జరుగుతోందని ఏపీ ప్రభుత్వం గమనించిందన్నారు. బ్లాక్‌ టిక్కెట్లను అరికట్టేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో త్వరలోనే భేటీ అవనున్నట్లు నాని వెల్లడించారు. ప్రజలకు మేలు చేసేందుకే ఏపీ ప్రభుత్వ ప్రయత్నమన్న నాని.. టికెట్‌ ధర, ఎక్కువ షోలు నియంత్రిస్తూ ఏప్రిల్ 8న జీవో ఇచ్చినట్లు స్పష్టం చేశారు. కాగా ఈ నెల 20న సినీ పెద్దలతో ఏపీ సీఎం జగన్ సమావేశమై... ఈ అంశంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: క్లాస్​-12లో టాపర్​.. 'నీట్​ ఫెయిల్'​ భయంతో ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.