మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వ్యాట్‌లో మార్పు చేస్తూ ఆబ్కారీ శాఖ జీవో జారీ చేసింది. రిటైల్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగే చోట పన్ను సవరణ చేసినట్లు తెలిపింది. దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేశారు.
- రూ.400 లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్
- రూ.400-2,500 మద్యం కేసుపై 60 శాతం వ్యాట్
- రూ.2,500-3,500 వరకు ఉన్న మద్యం కేసుపై 55 శాతం వ్యాట్
- రూ.3,500-5,000 ధర ఉన్న మద్యం కేసుపై 50 శాతం వ్యాట్
- రూ.5 వేలు, ఆపై మద్యం కేసుపై 45 శాతం వ్యాట్
- దేశీయ తయారీ బీర్ కేసుపై రూ.200 కంటే తక్కువున్న వాటిపై 50 శాతం వ్యాట్
- రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్
- అన్ని రకాల మద్యంపై 35 శాతం వ్యాట్
- రెడీ టు డ్రింక్‌లపై 50 శాతం వ్యాట్
మద్యం ధరలు రూ.400 లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ వేశారు. రూ.400-2,500 మద్యం కేసుకు 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయించారు. రూ.2,500-3,500 వరకు ఉన్న మద్యం కేసుకు 55 శాతం వ్యాట్ వేశారు. రూ.3,500-5,000 ధర ఉన్న మద్యం కేసుపై 50 శాతం వ్యాట్ వడ్డించారు. రూ.5 వేలు, ఆపై మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయించారు. దేశీయ తయారీ బీర్ కేసుపై రూ.200 కంటే తక్కువున్న వాటిపై 50 శాతం వ్యాట్ వేసినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయించారు. అన్ని రకాల మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని నిర్ణయించినట్లు ఆబ్కారీ శాఖ స్పష్టం చేసింది. రెడీ టు డ్రింక్‌లపై 50 శాతం వ్యాట్ వేసినట్లు ఆబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.
ఇదీ చదవండి: