జాతీయ రహదారుల వెంట ప్రతి 25 కిలో మీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వెల్లడించారు. తొలి దశలో 400 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ‘గో ఎలక్ట్రిక్’ ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్(ఈఈఎస్‌ఎల్) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన పాల్గొన్నారు.
'ప్రస్తుతం అవసరానికి తగ్గట్లుగా ఛార్జింగ్ కేంద్రాలు లేకపోవటం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలకు టెస్టింగ్ సౌకర్యాలు, ఇంటలిజెన్స్ ట్రాక్స్ కోసం సుమారు రూ.250 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశాం. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీగా నెడ్‌క్యాప్‌ను ఎంపిక చేశాం. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించి వాటి పనితీరు పరిశీలిస్తాం’'- ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్
వివిధ ప్రభుత్వ శాఖల్లో 300 ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి ఈఈఎస్‌ఎల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి తెలిపారు. ఏపీలో 83 చోట్ల 460 కారు ఛార్జర్లను ఏర్పాటు చేయటానికి ఎన్టీపీసీ, ఆర్‌ఐఈఎల్‌తో అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు. టెస్టింగ్ సౌకర్యాలు, ఇంటెలిజెన్స్ టెస్టింగ్ ట్రాక్స్ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ ఆసక్తి (ఈఓఐ)కనబరిచిందని వెల్లడించారు. తిరుపతి, విశాఖపట్నంలో ఆటోలకు బ్యాటరీలతో కూడిన ఎలక్ట్రిక్ కిట్లను జీఎంఆర్ ఫౌండేషన్‌తో కలిసి అందించే ప్రతిపాదన కూడా ఉంది అని తెలిపారు.
ఇదీ చదవండి: