ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సీఎం జగన్ భేటీ ముగిసింది. ఉభయ రాష్ట్రాల మధ్య కీలక అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. నేరడి బ్యారేజీ, జంఝావతి ప్రాజెక్ట్ సమస్యలతో పాటు కొఠియా గ్రామాల సమస్యలు భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. ఏపీ, ఒడిశా సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఇరువురు సీఎంలు ప్రకటించారు. రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కమిటీ ఏర్పాటవుతుందని వెల్లడించారు. సమావేశానికి ముందు ఒడిశా తెలుగు సంఘం ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిసి కొఠియా గ్రామాల సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: Kishan Reddy on CM KCR: తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు.. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్