ETV Bharat / city

భారీగా నగదు పట్టుకున్నారు.. తిరిగి ఇచ్చేశారు! - మడకశిర వార్తలు

తనిఖీల్లో భాగంగా ఓ వ్యాపారి వద్ధ నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఏపీలోని అనంతపురం పోలీసులు. తర్వాత అతని డబ్బును తిరిగి ఇచ్చేశారు... పూర్తి వివరాల్లోకి వెళితే...

భారీగా నగదు పట్టుకున్నారు....తిరిగి ఇచ్చేశారు!

author img

By

Published : Sep 25, 2020, 12:16 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం తమ్మిడేపల్లి చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా... కర్ణాటకకు చెందిన రమేశ్ అనే వక్కల వ్యాపారి వద్ద రూ.47.50 లక్షల నగదు పట్టుబడింది. అతనిని పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్ళి విచారించగా అమరాపురం మండల రైతుల నుంచి వక్కలు తీసుకెళ్లాను. దీనికి సంబంధించి ఆ రైతులకు డబ్బు ఇవ్వాల్సి ఉండగా... నగదుతో వచ్చానని వ్యాపారి తెలిపాడు.

అతను తెలిపిన విధంగా సంబంధిత వక్క రైతులను పిలిపించి విచారించగా... ఆ వ్యాపారి తమకు ఇచ్చేందుకే డబ్బు తెచ్చాడని రైతులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా...వారి ఆదేశాల ప్రకారం మొత్తం డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చామని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆటోల ద్వారా దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.