ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తైంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు రెస్ట్రోపెక్టివ్ స్టడీ ని ఆయుర్వేద వైద్యులు పూర్తిచేశారు. ఈ పరిశోధనల నివేదికను ఆన్‌లైన్‌లో సీసీఆర్ఏఎస్‌కు.. అధికారులు అందజేశారు. ఇందుకోసం మందు తీసుకున్న 570 మందిని ఫోన్లో సంప్రదించిన వైద్యులు.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు.
రోగులు ఇచ్చిన ఫీడ్బ్యాక్పై ఆయుర్వేద అధికారులు వివరాలు వెల్లడించలేదు. రేపటిలోగా సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు జారీ చేయనుందని భావిస్తున్నారు. ఆదేశాలు అందిన వెంటనే తర్వాత దశ ప్రయోగాలు ప్రారంభించి... టాక్సిక్ స్టడీ, జంతువులపై పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: కరోనా 'ల్యాబ్ లీక్'పై డబ్ల్యూహెచ్ఓ మరోసారి దర్యాప్తు!