ETV Bharat / city

విధిని ఎదిరించిన వీరుడు... ఈ రెండు రూపాయల వైద్యుడు

author img

By

Published : Jan 10, 2021, 10:00 PM IST

నడవలేరు... కనీసం లేవలేరు... సుమారు 20 సంవత్సరాల నుంచి కుర్చీకే పరిమితమయ్యారు. అయితేనేం ఆయన సంకల్పం ముందు వైకల్యం చిన్నదైపోయింది. వైద్య వృత్తిలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. అనేక శస్త్రచికిత్సలు చేసి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పతకాలు సొంతం చేసుకున్నారు. ఏపీలోని విశాఖ జిల్లాలో రెండు రూపాయల డాక్టర్‌గా పేరుగాంచిన సూర్యప్రకాశ్​రావు జీవిత గాథను తెలుసుకుందాం.

విధిని ఎదిరించిన వీరుడు... ఈ రెండు రూపాయల వైద్యుడు
విధిని ఎదిరించిన వీరుడు... ఈ రెండు రూపాయల వైద్యుడు

పీడకలలాంటి ప్రమాదం జీవితాన్ని ఒక్కసారిగా చీకటి చేసింది. ఎన్నో కలలతో నిర్మించుకున్న జీవితం ప్రమాదం బారిన పడింది. అయినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాను లేవలేనని తెలిసినా కుంగిపోలేదు. వెన్నెముక విరిగినా... సగం శరీరం పనిచేయకపోయినా... అతని సంకల్పం ముందు అన్నీ చిన్నబోయాయి. వైద్యవృత్తిపై అతనికి ఉన్న ప్రేమతో... పేదలకు విశేష సేవలందిస్తూ అందరి ఆశీస్సులు పొందుతున్నారు.

ఏపీలోని విశాఖ జిల్లాలో రెండు రూపాయల డాక్టర్‌గా పేరు తెచ్చుకున్న సూర్యప్రకాశ్‌రావుకు 2001లో ఊహించని ప్రమాదం ఎదురైంది. శ్రీకాకుళంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సమావేశానికి వెళ్లొస్తుండగా పరదేశిపాలెంలో వేగంగా వచ్చిన బస్సు ఆయన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యప్రకాశ్​రావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెన్నెముక విరగటంతో జీవితాంతం నడవలేరని... తన శరీరం పాక్షికంగానే పనిచేస్తుందని డాక్టర్లు చెప్పారు.

ఎన్నో పతకాలు... మరెన్నో ప్రశంసలు

ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందనే ఆశతో ముంబయిలోనూ సూర్యప్రకాశ్​రావు చికిత్స తీసుకున్నారు. కానీ పూర్తిగా కోలుకోలేదు. తాను ఏదైనా సాధిస్తాననే నమ్మకంతో కేవలం రెండు సంవత్సరాల్లోనే మళ్లీ వృత్తిలో అడుగుపెట్టాడు. చేతివేళ్లు సరిగా సహకరించకున్నా వైద్యం మొదలుపెట్టారు. రెండేళ్లలోనే ఫిట్‌నెస్‌ ధ్రువపత్రం సాధించారు. కుర్చీలో ఉంటూనే చెవి, ముక్కు, గొంతు సంబంధ శస్త్రచికిత్సలు చేసి ఎన్నో పతకాలు సాధించారు. మెరుగైన పనితీరుతో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. అనంతరం ఓ యూనిట్‌కు అధిపతి అయ్యారు.

పేదలకు సాయం

ఎందరో వైద్యవిద్యార్థులకు తన జీవితాన్నే ఆదర్శంగా చూపిస్తున్నారు సూర్యప్రకాశ్​రావు. ఉదయమంతా కాలేజీలో గడిపి.. సాయంత్రం ఇంటికిరాగానే పేద, మధ్యతరగతి వారికి చికిత్సలందిస్తున్నారు. నగరంలోని దాబాగార్డెన్‌లో ఉన్న ఎబిలిటీ సెంటర్‌లో వెన్నెముక విభాగంలో గౌరవాధ్యక్షులుగా కొనసాగుతూ పేదలకు కృత్రిమ పరికరాలు అందేలా చూస్తున్నారు.

ఇదీ చదవండి: మనసు దోచే లక్నవరం.. పర్యటకుల పాలిట స్వర్గధామం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.