ETV Bharat / city

అమృత స్వాతి మెమోరియల్​ ట్రస్ట్​ దాతృత్వం - పోలీసులకు దుస్తులు అందించిన అమృత స్వాతి మెమోరియల్​ ట్రస్ట్​

హైదరాబాద్​లో అమృత స్వాతి మెమోరియల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​ సిబ్బందికి యూనిఫామ్స్​, మాస్కులు, శానిటైజర్స్​, గ్లౌస్​లు అందించారు. మానవ హక్కుల సంఘం సభ్యుడు ఇర్ఫాన్​, వెస్ట్​ జోన్​ డీసీపీ ఏఆర్​ శ్రీనివాస్, ట్రస్ట్​ అధ్యక్షుడు ధనాల శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.

amrutha swathi trust donated uniforms to police in hyderabad
అమృత స్వాతి మెమోరియల్​ ట్రస్ట్​ దాతృత్వం
author img

By

Published : Apr 18, 2020, 10:47 AM IST

Updated : Apr 18, 2020, 11:53 AM IST

హైదరాబాద్​లో అమృత స్వాతి మెమోరియల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​ సిబ్బందికి యూనిఫామ్స్​, మాస్కులు, శానిటైజర్స్​, గ్లౌస్​లు అందించారు. మానవ హక్కుల సంఘం సభ్యుడు ఇర్ఫాన్​, వెస్ట్​ జోన్​ డీసీపీ ఏఆర్​ శ్రీనివాస్, ట్రస్ట్​ అధ్యక్షుడు ధనాల శ్రీనివాస్​రెడ్డి వీటిని పంపిణీ చేశారు.

లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలుచేసేందుకు పోలీసులు ఎనలేని కృషిచేస్తున్నారని రాష్ట్ర మానవహక్కుల కమిషన్​ సభ్యుడు ఇర్ఫాన్​ ప్రశంసించారు. పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్, దుస్తులు​ పంపిణీ చేసేందుకు ముందుకొచ్చిన అమృత స్వాతి మెమోరియల్​ ట్రస్ట్​ అధ్యక్షుడు ధనాల శ్రీనివాస్​రెడ్డిని అభినందించారు.

కరోనా వంటి ఆపత్కాల సమయంలో వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి పోలీసులు పనిచేస్తున్నారని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు. పోలీసుల కృషిని గుర్తించినందుకు ట్రస్ట్ బృందాన్ని అభినందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం అభినందనీయమని, స్వాతి ఆత్మ తప్పక శాంతిస్తుందని అన్నారు.

దేశ సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది మాదిరిగా.. రాష్ట్రంలో పోలీసులు పనిచేస్తున్నారని ట్రస్ట్ అధ్యక్షుడు ధనాల శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో పోలీసులు.. కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నారన్నారు. వారి కష్టానికి ఎంత చేసినా తక్కువేనన్నారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ కేఎస్​రావు, సీఐ కళింగరావు. డీఐ రవికుమార్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అమృత స్వాతి మెమోరియల్​ ట్రస్ట్​ దాతృత్వం

ఇవీచూడండి: లాక్​డౌన్​తో పండ్ల రైతులకు కష్టాలు.. ఉద్యాన శాఖ ప్రత్యేక దృష్టి

Last Updated : Apr 18, 2020, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.