కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శ్రీశైలంలో పర్యటించారు. కుటుంబసభ్యులతో కలిసి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి చేరుకున్న అమిత్‌షాకు.. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అమిత్‌షా దర్శించుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో అమిత్ షా మొక్కలు నాటారు. ఈ మధ్యనే తవ్వకాల్లో బయటపడిన తామ్ర శాసనాలను పరిశీలించారు. శ్రీశైలంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం సున్నిపెంట నుంచి హెలికాప్టర్లో అమిత్ షా దంపతులు హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. అనంతరం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి దిల్లీకి చేరుకున్నారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: