ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు ఆతిథ్యం బాగుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందించారు. రాష్ట్రపతిభవన్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన విందు సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌తో కరచాలనం చేసి జీఈఎస్ గురించి ప్రస్తావించారు. సదస్సుకు మీరు హాజరవుతారని భావించామని ట్రంప్‌తో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. సదస్సుకు రావాలని తాను ప్రయత్నించినా సాధ్యం కాలేదని అగ్రరాజ్య అధినేత సమాధానమిచ్చినట్లు సమాచారం.
ఇదీ చూడండి: ట్రంప్ పర్యటనపై విదేశీ మీడియా ఏమందంటే..