హుస్సేన్‌సాగర్ తీరంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 125 అడుగుల ఎత్తు, 45.5 అడుగుల వెడల్పుతో... 7.91 లక్షల కిలోల స్టీల్ ఉపయోగించి, 96.19 టన్నుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. రూ.146.5 కోట్ల వ్యయంతో... 11.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టను చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన నమూనాను... మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్ ఆవిష్కరించారు. రాష్ట్రానికే తలమానికంగా అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మ్యూజియం, గ్రంథాలయంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: వట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టాలని భట్టికి విజ్ఞప్తి : కేటీఆర్