ETV Bharat / city

Ambati on polavaram: డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి అదే కారణం: అంబటి - పోలవరం న్యూస్

గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ పాడైందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కాపర్ డ్యాం సగంలో ఉండగానే డయాఫ్రం వాల్ కట్టడం తప్పు అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తామనేది పరిశీలించి చెబుతామని అన్నారు.

Ambati on polavaram
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
author img

By

Published : Apr 23, 2022, 8:42 PM IST

పోలవరం నిర్మాణంపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తామనేది పరిశీలించి చెబుతామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే డయాఫ్రం వాల్ పాడైందన్నారు. ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రం వాల్ దెబ్బతినలేదని గుర్తు చేశారు. కాపర్ డ్యాం, అప్రోచ్ కెనాల్ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టారన్నారు. కాపర్ డ్యాం సగంలో ఉండగానే డయాఫ్రం వాల్ కట్టడం తప్పు అని అన్నారు. డయాఫ్రం వాల్‌లో ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు రూ.800 కోట్ల ఖర్చవుతుందని వెల్లడించారు. డయాఫ్రం వాల్‌లోని నీరు ఎత్తిపోయాలంటే రూ.2,100 కోట్ల ఖర్చవుతుందని చెప్పారు. డయాఫ్రం వాల్ దెబ్బతిందని 2020 మార్చి 8న గుర్తించారని.. దెబ్బతిన్న వాల్‌ మళ్లీ కట్టాలా.. కొత్తది నిర్మించాలా అనేదానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు.

"2018 నాటికే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. డయాఫ్రం వాల్ పాడయ్యేందుకు గత ప్రభుత్వ తప్పిదమే కారణం. కాపర్ డ్యాం, డయాఫ్రం వాల్ పూర్తయ్యాకే స్పిల్‌వే కట్టాలి. కాపర్ డ్యాం సగంలో ఉండగానే డయాఫ్రం వాల్ కట్టడం తప్పు. డయాఫ్రం వాల్ దెబ్బతిందని 2020 మార్చి 8న గుర్తించారు. ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రం వాల్ దెబ్బతినలేదు. దెబ్బతిన్న వాల్‌ మళ్లీ కట్టాలా.. కొత్తది నిర్మించాలా అనేదానిపై అధ్యయనం. పోలవరంపై దేనికైనా చర్చకు మేం సిద్ధం. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తామనే దాన్ని పరిశీలించి చెబుతాం." - అంబటి రాంబాబు, జలవనరులశాఖ మంత్రి

ఇదీ చదవండి: POLAVARAM : పోలవరం డయాఫ్రం వాల్‌ విధ్వంసం... ఎవరిదీ వైఫల్యం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.