ETV Bharat / city

Amaravati padayatra: 'ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే.. ప్రజలు అక్కున చేర్చుకున్నారు' - అమరావతి పాదయాత్ర

పాలకులు కక్షకడితే.. ప్రజలు ఆదరించారు..! పోలీసులు క్రౌర్యం ప్రదర్శిస్తే.. పల్లెలు ఆప్యాయత చూపించాయి.. పాదయాత్రికుల ఊరు తప్ప, పేరు తెలియక పోయినా అక్కున చేర్చుకున్నారు. ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. అలసిన పాదాలకు పాలాభిషేకం చేశారు. కర్ణాటక, తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల్లోని రైతులు, తెలుగువారూ వెతుక్కుంటూ వచ్చి రైతులకు సంఘీభావం తెలిపారు. ఏపీలో అమరావతి రైతుల ఆక్రందన దేశానికి అన్నంపెట్టే రైతులందరిదీ అని చాటారు.

Amaravati padayatra
అమరావతి మహా పాదయాత్ర
author img

By

Published : Dec 17, 2021, 5:09 AM IST

amaravati padayatra:ఏపీలోని అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ పాదయాత్రకు మద్దతు సహజం. ప్రకాశం జిల్లా పక్కనే ఉంది కాబట్టి అక్కడా సంఘీభావం వెల్లువెత్తింది. కానీ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో స్పందనను ఊహించగలమా? ఈ సందేహాలన్నీ పాదయాత్రలో పటాపంచెలయ్యాయి. రైతులకు మద్దతుగా. సింహపురి సై అంటే.. తిరునగరి రారమ్మని ఆహ్వానించింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 18రోజులు, చిత్తూరు జిల్లాలో 8 రోజులు దిగ్విజయంగా సాగింది.

భావోద్వేగాల కలబోతగా పాదయాత్ర..
amaravati padayatra:అమరావతి నుంచి అలిపిరి వరకూ అనేక భావోద్వేగాల కలబోతగా పాదయాత్ర సాగింది. దారి పొడవునా పొలాల్లో ఉన్న కూలీలు, రైతులు సాటి రైతులకు మద్దతు తెలిపారు. పనులు కాసేపు పక్కనపెట్టి పాదయాత్రవెళ్లే రోడ్డుమీదకు వచ్చి కలిశారు. అమరావతి రైతులతో గొంతు కలిపారు. అమరావతి రైతులు ఒంటరివారు కారని, తామంతా వెంట నడుస్తామని ఏడుకొండలవాడి చెంతకు చేరేలోపే కొండంత భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లావెంగమాంబపురంలో యాత్రకు మద్దతుగా స్థానికులు అమరావతి అంటూ పొలంలో వరినాట్లు వేశారు. అమరావతి రైతులూ నాట్లు వేసి.. స్థానిక రైతులకు కృతజ్ఞతలు చెప్పారు.

అమరావతి మహా పాదయాత్ర

వెంకటేశ్వరస్వామి రథం ముందు ముస్లింలు నమాజ్‌ ..
rayalaseema farmers: సీమజిల్లాల నుంచీ జనం తరలివచ్చి పాదయాత్రకు నీరాజనాలు పలకడం రైతులు ఊహించని ఘట్టం! పులివెందుల నియోజకవర్గం వేంపల్లెకు చెందిన రైతులు ఉద్యమకారుల వెంట నడిచారు. సంతవెల్లూరుకు చెందిన దివ్యాంగుడు బత్తయ్య... కష్టమైనా ఇష్టంగా నడవడం ఉద్యమానికి ఉత్సాహాన్నిచ్చింది. నంద్యాలకు చెందిన ముస్లింలు యాత్ర దిగ్విజయం కావాలని.. వెంకటేశ్వరస్వామి రథం ముందు నమాజ్‌ చేసి సర్వమత సమ్మేళనాన్ని చాటారు. మీవెంటే మేమంటూ రైతులకు మనోస్థైర్యాన్ని ఇచ్చారు. కొందరు పసుపు నీళ్లతో..... రైతుల కాళ్లుకడిగితే, మరికొందరు పాలతో అభిషేకం చేసి నెత్తిన చల్లుకున్నారు. డేగపూడి గ్రామం వద్ద ఎప్పుడూ గడపదాటని ముస్లిం మహిళలు చంటిబిడ్డలను ఎత్తుకుని అమరావతి రైతుల కోసం వేచిచూసిమరీ సంఘీభావం తెలిపారు.

మండుటెండలో రోడ్డుపై సాష్టాంగ నమస్కారం..
padayatra in chittoor: పాదయాత్ర నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలోకి ఉద్విగ్న వాతావరణంలో అడుగుపెట్టింది. స్థానికుల ఆదరాభిమానాలకు అమరావతి రైతులు కాళ్లు, ఒళ్లు నొప్పులు మరచిపోయారు. ముక్కూమొహం తెలియని తమను తోబుట్టువుల్లా చూసుకున్న సింహపురి వాసులకు.... వెంకటగిరి సరిహద్దు వద్ద మోకరిల్లి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో చిత్తూరు జిల్లా వాసులు అమరావతి రైతులను మోకాళ్లపై కుర్చుని స్వాగతిచండం భావోద్వేగాలను పలికించింది. సీమ ప్రజల స్వాగతసత్కారాలకు చలించిన అమరావతి రైతులు మండుటెండలోనే రోడ్డుపై సాష్టాంగ నమస్కారం చేసి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. ఇది పాదయాత్ర మొత్తానికీ అపూర్వఘట్టం.

దిల్లీ నుంచి వచ్చి పాదయాత్రలో..
amaravathi farmers: అమరావతి రైతుల గుండెఘోష.. పొరుగురాష్ట్రాలనూ కదిలించింది. ఇతర రాష్ట్రాల నుంచీ రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఉద్యమకారుల వెన్నుతట్టారు. భారతీయ కిసాన్‌ మజ్దూర్‌ యూనియన్‌నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ తన మేనల్లుడు అమిత్‌ బృందాన్ని వెంకటగిరిగి పంపి సంఘీభావం ప్రకటించారు. కిసాన్‌ సంఘ్‌ ప్రతినిధులు దిల్లీ నుంచి వచ్చి 3 రోజులపాటు పాదయాత్రలో రైతుల వెంట నడిచారు. చెన్నై,మహారాష్ట్రలో స్థిరపడిన తెలుగు వారు సొంత ఖర్చులతో వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. సాటి తెలుగువాళ్లకు జరుగుతున్న వంచనను తట్టుకోలేకే ఇంతదూరం స్వచ్ఛందంగా వచ్చామంటూ అమరావతి రైతులకు ప్రోత్సాహం ఇచ్చారు. ఉద్యమానికి తమవంతు విరాళం కూడా అందజేశారు.

విరాళాలు..
కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు మహిళలు, రైతులుయలమంచిలి వాసుదేవరావు నేృతృత్వంలో కాళహస్తిలో ఉద్యమకారులను కలిశారు. వారంతా ఉద్యమానికి 60 లక్షల విరాళం ఇచ్చారు. ఇక యాత్రలో అనేక మంది పారిశ్రామక వేత్తలు, విద్యార్థులు రైతులకు తోడ్పాటు అందించాయి . పారిశ్రామికవేత్త హరిశ్చంద్రప్రసాద్‌ రైతులను కలిసి 10 లక్షల రూపాయల చెక్కు అందించారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.