ETV Bharat / city

Maha Padayatra 11th Day: జోరువానలో అమరావతి హోరు.. ప్రజ్వలిస్తున్న మహాపాదయాత్ర - ap farmers maha padayatra

ఓ వైపు జోరు వాన.. మరోవైపు పోలీసుల అడ్డగింతలు.. అయినా వెరవకుండా ముందుకే సాగుతున్నారు అమరావతి రైతులు! ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని చేపట్టిన మహా పాదయాత్ర(amaravati farmers maha Padayathra ) గురువారానికి పదకొండో రోజుకు చేరింది. నేడు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు నుంచి ముక్తినూతలపాడు వరకు కొనసాగుతోంది. అయితే.. ఈ పాదయాత్రలో పాల్గొనకుండా.. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

maha padayatra
maha padayatra
author img

By

Published : Nov 11, 2021, 8:50 AM IST

Updated : Nov 11, 2021, 11:01 AM IST

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర(amaravati farmers maha Padayathra) పదకొండో రోజు(eleventh day)కు చేరింది. ప్రకాశం జిల్లా(prakasam district)లో రైతుల మహా పాదయాత్ర ఐదో రోజుకు చేరింది. పాదయాత్రకు అడుగడునా ఆంటకాలను ఏర్పరుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మద్దతుగా నేడు పాదయాత్రలో పాల్గొనేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధం(House arrest) చేశారు. చిలకలూరిపేటలో గొట్టిపాటి రవికుమార్‌, మార్టూరులో ఏలూరి సాంబశివరావులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున్న నేతలను అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు.

పాదయాత్రకు వర్షం అడ్డంకి..

నేడు జిల్లాలోని నాగులుప్పలపాడు నుంచి ముక్తినూతలపాడు వరకు మొత్తం 14 కి.మీ పాదయాత్ర (Naguluppalapadu to Muktinuthalapadu) సాగనుంది. ఓ వైపు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తుండగా.. మరోవైపు వర్షం కురుస్తోంది. అయినా రైతులు.. పాదయాత్రను కొనసాగిస్తున్నారు. గొడుగులు, రెయిన్‌కోట్లు ధరించి ముందుకు సాగుతున్నారు.

మరోవైపు.. ప్రకాశం జిల్లాలో ఎన్నికల కోడ్ ఉందంటూ పోలీసులు.. నాగులుప్పలపాడు వెళ్లే మార్గంలో రోడ్లను దిగ్బంధిస్తున్నారు. ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల నడుమ రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తమ లక్ష్యాన్ని అడ్డుకోలేరంటూ రైతులు, మహిళలు నినదిస్తున్నారు. రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అన్ని వర్గాల వారు సంఘీభావం తెలుతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, నేతలు పాల్గొంటున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర పేరుతో నవంబర్ 1వ తేదీన రైతులు మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజుల పాటు సాగునున్న ఈ పాదయాత్ర.. డిసెంబర్ 15వ తేదీన చిత్తూరు జిల్లాలో ముగియనుంది.

బుధవారం ఇలా సాగింది..

అమరావతి రైతుల మహా పాదయాత్ర(maha Padayathra)కు పూల వర్షంతో పల్లె జనులు స్వాగతం పలుకుతున్నారు. పది రోజులు పూర్తి చేసుకున్న యాత్ర బుధవారం ప్రకాశం జిల్లాలో సాగింది. ఉదయం 9 గంటలకు దుద్దుకూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాచపూడి, కల్లగుంట మీదుగా సాయంత్రం నాగులుప్పలపాడు చేరుకుంది. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని రైతులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు మద్దతుగా తరలిరాగా.. 4 కి.మీ మేర జన జాతరను తలపించింది. మరోవైపు మఫ్టీలో ఉన్న పోలీసులు ఫొటోలు తీస్తూ, డ్రోన్‌తో వీడియో చిత్రీకరిస్తూ కనిపించారు. అమరావతికి మద్దతు తెలుపుతూ ప్రజలు తమ వెంట తెచ్చుకున్న బ్యానర్లు ప్రదర్శించారు. ‘నాటి స్వాతంత్య్ర సమరయోధుల అసలైన వారసులు నేటి అమరావతి రైతులు’, ‘వృథా పోదు తల్లి.. మీ కష్టం, ఏకైక రాజధానిగా అమరావతి తథ్యం’, ‘మూడు రాజధానులు వద్దు...ఒకే రాజధాని ముద్దు’ వంటి బ్యానర్లు కనిపించాయి. ఖమ్మంకు చెందిన ప్రకాశరావు దంపతులు ఆలోచింపజేసే బ్యానర్‌తో యాత్రలో పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని రాచపూడి వద్ద స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఆధ్వర్యంలో రైతులకు స్వాగతం పలికారు.

పూల దారిపై నడక

పూల దారిపై నడిపిస్తూ..సంఘీభావం తెలపడానికి వస్తున్న మహిళలు మహా పాదయాత్ర(maha Padayathra)కు గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 700 కాయలు వినియోగించారు. దుద్దుకూరు నుంచి రాచపూడి వరకు 4 కి.మీ మేర పూల మార్గం ఏర్పాటు చేశారు. పర్చూరు, అద్దంకి, కొండపి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, రవికుమార్‌, శ్రీబాల వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌రావు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, ముత్తముల అశోక్‌రెడ్డి, బీఎన్‌ విజయ్‌కుమార్‌, డేవిడ్‌రాజు, ఐకాస నేత కొటికలపూడి శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకుడు జ్యోతుల నెహ్రూ తదితరులు సంఘీభావంగా యాత్రలో పాల్గొన్నారు. మరోవైపు బుధవారం ఒక్క రోజే యాత్రకు రూ.60 లక్షల వరకు విరాళాలు వచ్చాయి. అద్దంకి నియోజకవర్గ ప్రజలు రూ.36 లక్షలు, ఎమ్మెల్యే రవికుమార్‌ బృందం రూ.10లక్షలు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రూ.10 లక్షలు విరాళమిచ్చారు.

13న ఐటీ ఉద్యోగుల చలో మహా పాదయాత్ర

ఏపీ రాజధాని రైతుల మహా పాదయాత్ర(maha Padayathra)కు సంఘీభావం ప్రకటించిన హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఐటీ ఉద్యోగులు 13న యాత్రలో పాల్గొననున్నారు. 12 రాత్రి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరి, 13 ఉదయం ప్రకాశం జిల్లా ఎర్రజర్లలో రైతుల పాదయాత్ర ప్రదేశానికి చేరుకుంటారని అమరావతి పరిరక్షణ సమితి హైదరాబాద్‌ కన్వీనర్‌ ప్రవీణ్‌ తెలిపారు. యాత్రలో పాల్గొనాలనుకునే వారు జేఏసీ సభ్యులను(80956 12417) సంప్రదించాలని పేర్కొన్నారు.

Last Updated : Nov 11, 2021, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.