ETV Bharat / city

Amaravathi Capital City: సర్కారు కీలక నిర్ణయం.. నగరపాలక సంస్థగా అమరావతి.! - అమరావతి తాజా వార్తలు

Amaravathi Capital City: ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిని.. మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలోని 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా మార్చనున్నట్లు ప్రకటించింది.

Amaravathi Capital City
కార్పొరేషన్​గా అమరావతి
author img

By

Published : Jan 3, 2022, 4:44 PM IST

Amaravathi Capital City: అమరావతి రాజధాని ప్రాంతంపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతాన్ని నగరపాలకసంస్థగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. అమరావతి క్యాపిటల్ సిటీని.. కార్పొరేషన్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. రాజధానిలోని 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా మార్చనున్నట్లు ప్రకటించింది.

ఇందులో భాగంగా.. ప్రజాభిప్రాయ సేకరణకు సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ వివేక్​ యాదవ్​.. గ్రామసభల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. తుళ్లూరులోని 16, మంగళగిరిలోని 3 గ్రామాల్లో సభలు జరపాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు.

ఇదీ చదవండి : Bandi Sanjay: బండి సంజయ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.