ETV Bharat / city

'ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం'.. అమరావతి ప్రజాదీక్షలో రైతులు - అమరావతి ప్రజాదీక్ష న్యూస్

Amaravati Protest: అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ చేసిన మోసాన్ని ఏపీ ప్రజలందరూ గుర్తించాలని రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. ఉద్యమం 800 రోజులకు చేరిన వేళ.. రైతులు చేపట్టిన 24 గంటల సామూహిక నిరాహారదీక్షను విపక్ష పార్టీల నేతలు విరమింపజేశారు. అమరావతి రాజధాని లక్ష్యాన్ని చేరుకునే వరకూ వెనకడుగు వేసేది లేదని ఈ సందర్భంగా రైతులు, మహిళలు తేల్చిచెప్పారు.

amaravathi protest
amaravathiamaravathi protest
author img

By

Published : Feb 25, 2022, 10:37 PM IST

Amaravati Protest: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన 24 గంటల నిరాహారదీక్ష ముగిసింది. పోరాటం మొదలు పెట్టి 800 రోజులైనందున.. వెలగపూడిలో రైతులు సామూహిక నిరాహారదీక్షను గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభించి.. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు కొనసాగించారు. నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమానికి తెదేపా, జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాల నాయకులు హాజరయ్యారు. రైతులకు నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింప చేశారు. తాము చేపట్టిన ఉద్యమంలో ఇది ఒక భాగం మాత్రమేనని.. తప్పనిసరిగా అమరావతిని రాజధానిగా ప్రకటించేవరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టంచేశారు.

ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన తెలుగుదేశం నేతలు.. వైకాపా ప్రభుత్వం వంచనకు మారుపేరని అమరావతి విషయంలో ఇది నిరూపితమైందని విమర్శించారు. కేంద్రం అనుకుంటే రాజధానిగా అమరావతి ప్రకటన వెంటనే వస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు. రైతుల ఆవేదన సీఎంకు ఎందుకు కనిపించటం లేదని పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ నిలదీశారు. అమరావతి విషయంలో జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్​ స్పష్టంచేశారు. మద్దతు ఇచ్చిన రాజకీయ పక్షాలకు, ప్రజాసంఘాలకు అమరావతి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

'ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం'.. అమరావతి ప్రజాదీక్షలో రైతులు

ఇదీచూడండి: వివేకా రక్తపు మరకలను వాళ్లే శుభ్రం చేయించారు: సీబీఐకి ప్రతాప్‌రెడ్డి వాంగ్మూలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.