తమను న్యాయదేవతే రక్షిస్తుందని ఏపీలోని అమరావతి రాజధాని ప్రాంత రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు. బోరుపాలెంలో రైతులు తాళాలు వాయిస్తూ నిరసన తెలిపారు. న్యాయస్థానంలో వచ్చిన తీర్పుపై ఆనందం వ్యక్తం చేశారు.
నీరుకొండ, పెదపరిమిలో 254వ రోజు రైతులు దీక్షలను కొనసాగించారు. ఉద్దండరాయుని పాలెంలో దీక్ష కోసం వేసిన టెంట్లను తొలగించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా ఇకపై టెంట్లు వేయకుండానే ఆందోళనలు చేస్తామని రైతులు వెల్లడించారు.
ఇదీ చదవండి: డివైడర్ స్తంభాన్ని ఢీకొట్టి... గాలిలో ఎగిరి... అక్కడికక్కడే మృతి