Amaravati farmers Maha Padayatra: అలుపెరగకుండా సాగుతున్న అమరావతి రైతుల.. న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర 26వ రోజుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రాజుపాలెం నుంచి ఇవాళ యాత్ర ప్రారంభించారు. నేడు భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌కు నివాళలర్పించి పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని అమరావతి విషయంలో రాజ్యాంగబద్ధంగా న్యాయం జరగాలని రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మారి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆకాంక్షించారు. నేడు 15 కిలోమీటర్ల మేర రైతుల మహాపాదయాత్ర సాగనుంది.
45 రోజుల పాటు మహాపాదయాత్ర కొనసాగనుండగా.. డిసెంబరు 15న తిరుమలకు చేరుకునేలా అమరావతి ఐకాస నేతలు ప్రణాళిక రూపొందించారు.
ఇదీ చదవండి: Autocracy startup : రైతుల కోసం ఇద్దరు స్నేహితుల కృషి.. చక్ర -100 డిచర్తో లాభాలెన్నో..