ETV Bharat / city

Allu Ramalingaiah: నవ్వులకు కొత్త భాష్యం.. 'అల్లు' హాస్యం - Allu Ramalingaiah: నవ్వులకు కొత్త భాష్యం.. 'అల్లు' హాస్యం

'పుట్టిల్లు' చిత్రంతో వెండితెరకు పరిచయమై.. కొన్ని వందల సినిమాల్లో నటించి హాస్యానికి మారుపేరుగా నిలిచారు అల్లు రామలింగయ్య. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా రామలింగయ్య వ్యక్తిగత జీవితంతో పాటు, సినీ కెరీర్​పై ప్రత్యేక కథనం మీకోసం.

నవ్వులకు కొత్త భాష్యం.. 'అల్లు' హాస్యం
నవ్వులకు కొత్త భాష్యం.. 'అల్లు' హాస్యం
author img

By

Published : Oct 1, 2021, 6:43 AM IST

తెలుగులో జానపద, పౌరాణిక చిత్రాలకు ఆదరణ తగ్గిన తర్వాత ఎక్కువగా సాంఘిక చిత్రాలు తెరకెక్కాయి. అదే రోజుల్లో రాజమహేంద్రవరానికి చెందిన గరికిపాటి రాజారావు వైద్యవృత్తిలో ఉంటూ.. ప్రజా నాట్యమండలి కార్యక్రమాలలో, నాటకాల్లో చురుగ్గా పాల్గొంటూ వుండేవారు. ఆయన సమాజానికి మంచి సందేశాన్ని అందించే సినిమా నిర్మించాలని 1953లో 'పుట్టిల్లు' అనే సినిమా నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ప్రఖ్యాత నటీమణి జమునతో పాటు మరొక నటుడు కూడా కొత్తగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆయనే హాస్యనట చక్రవర్తి అల్లు రామలింగయ్య. రేలంగి తర్వాత 'పద్మశ్రీ' పురస్కారం అందుకున్న రెండవ హాస్యనటుడు ఆయనే. గొప్ప మానవతావాది కూడా. ఈ రోజు అల్లు రామలింగయ్య జయంతి. ఈ సందర్భంగా హాస్యానికి కొత్త భాష్యం చెప్పి, నవ్వుల గుండెల్లో కొలువుంటానని చాటిచెప్పిన 'అల్లు' రామలింగయ్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.

పాలకొల్లు నుంచి ప్రస్థానం...

అల్లు రామలింగయ్య 1922 అక్టోబరు 1న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. తండ్రి వెంకయ్యకి ఏడుగురు సంతానం. వారిలో రామలింగయ్య నాలుగోవారు. రామలింగయ్యకు చదువు సంధ్యలు అబ్బలేదు. ఎప్పుడూ ఆకతాయి కుర్రాడిలా తిరిగేవారు. ఆట పాటలతో పాటు తన సహచరులను సరదాగా నవ్విస్తూ వుండేవారు. నాటకాలను బాగా చూసేవారు. అప్పట్లో నాటకాల కంపెనీలు ఊరూరా తిరుగుతూ ఉండేవి. ఆ కంపెనీ మేనేజర్ల చుట్టూ తిరుగుతూ నాటకాలలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు. ఒకసారి 'భక్త ప్రహ్లాద' అనే నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. ఆ వేషాన్ని అదురూ బెదురూ లేకుండా రక్తి కట్టించారు రామలింగయ్య.

మొదట డబ్బులు ఎదురిచ్చి నాటకాల్లో వేషాలు సంపాదిస్తూ రామలింగయ్య నట జీవితం మొదలైంది. గాంధీజీ 1942లో 'క్విట్‌ ఇండియా' ఉద్యమానికి పిలుపిచ్చే సమయానికి రామలింగయ్యకు ఇరవై ఏళ్లు. సామాజిక బాధ్యతను గుర్తించిన రామలింగయ్య యువతను ఉత్తేజపరచి ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాజమండ్రి జైలుకెళ్లారు. అక్కడ తన సహచర సమరయోధుల్ని నవ్విస్తూ చిన్న చిన్న నాటకాలు వేస్తూ, బుర్రకథలు చెబుతూ అందరికీ వినోదం పంచేవారు. జైలు నుంచి విడుదలయ్యాక కమ్యూనిస్టు వారితో చేరి స్వాతంత్ర్యోద్యమంలో చేరారు. అప్పుడే గరికిపాటి రాజారావుతో ఆయనకు పరిచయమైంది.

సినిమాల్లోకి ప్రవేశం...

రామలింగయ్యకు సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండేది. అప్పటికే రామలింగయ్యకు కనకరత్నంతో వివాహమై నలుగురు సంతానం. రాజమండ్రి పట్టణానికి చెందిన డాక్టర్‌ గరికిపాటి రాజారావు 1952లో 'పుట్టిల్లు' అనే సాంఘిక సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పుడు.. రామలింగయ్య అందులో వేషం కోసం ప్రయత్నించారు. అతని ప్రయత్నం ఫలించి అందులో నటించే అవకాశం రావడం వల్ల భార్యా పిల్లలతో మద్రాసు పయనమయ్యారు.

ఆ సినిమా నిర్మాణ దశలో రామలింగయ్య పొట్టకూటి కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడే హోమియో వైద్యం మీద దృషి పెట్టి ఆ విద్యను నేర్చుకున్నారు. దాంతో సంసారాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. 'పుట్టిల్లు' సినిమా విడుదలైంది. కానీ ఆ సినిమా అపజయాన్ని చవిచూడడం వల్ల రామలింగయ్యకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన 'వద్దంటే డబ్బు' సినిమాలో 'మాస్టర్‌ బద్దంకి' అనే పాత్రలో నటించే అవకాశం దొరికింది. వై.ఆర్‌.స్వామి దర్శకత్వంలో ఎన్‌.టి. రామారావు, జానకి నటించిన ఈ చిత్రం 1954లో విడుదలై విజయవంతం కావడం వల్ల రామలింగయ్యకు నటుడిగా గుర్తింపు వచ్చింది.

ధైర్యం కోల్పోకుండా చిత్రసీమనే నమ్ముకొని ఎలాంటి పాత్ర వచ్చినా అందులో రాణిస్తూ తనదైన ముద్ర వేసేందుకు బాగా కష్టపడ్డారు. బోళ్ల సుబ్బారావు నిర్మించిన 'పల్లెపడుచు' (1954) చిత్రం తర్వాత రామలింగయ్యకు విజయావారి 'మిస్సమ్మ', అన్నపూర్ణావారి ప్రధమ చిత్రం 'దొంగరాముడు' సినిమాల్లో అవకాశం చిక్కింది.

1960లో అల్లు రామలింగయ్య చిత్రసీమలో నిలదొక్కుకొని హాస్యంతో కూడిన విలన్‌ పాత్రలు పోషిస్తూ మంచి విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ పేరు గడించారు. మాయాబజార్, మూగమనసులు, ముత్యాలముగ్గు, మనవూరి పాండవులు, శంకరాభరణం, అందాలరాముడు, బుద్ధిమంతుడు, ప్రేమించి చూడు వంటి సినిమాలలో రామలింగయ్యకు అద్భుతమైన పాత్రలు దొరకడం వల్ల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన లేని సినిమాలు బహు అరుదుగా ఉండేవి.

ప్రభుత్వ సత్కారాలు.. అల్లు సంస్థలు...

రామలింగయ్య సుదీర్ఘకాలం ప్రేక్షకులను నవ్విస్తూ, హాస్యంతో కూడిన విలన్​గా రాణించారు. సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1990లో ఆయనకు 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందజేసింది. 2001లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'రఘుపతి వెంకయ్య' అవార్డుతో రామలింగయ్యను సత్కరించింది. ఆయన కాంస్య విగ్రహాన్ని సొంతూరు పాలకొల్లులో, విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌ రోడ్డులో ప్రతిష్టించారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారత తపాలా శాఖ అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. నృత్య కళామండలి రామలింగయ్యకు 'హాస్య కళా ప్రపూర్ణ' అనే బిరుదు ప్రసాదించింది. రాజమహేంద్రవరంలో అల్లు రామలింగయ్య పేరుతో ఒక హోమియో కళాశాల నెలకొల్పారు. రామలింగయ్య నిర్మాతగా మారి 1972లో 'గీతా ఆర్ట్‌' సంస్థను నెలకొల్పారు. 'బంట్రోతు భార్య', 'దేవుడే దిగివస్తే', 'బంగారు పతకం' వంటి చిత్రాలు నిర్మించారు. తర్వాత కుమారుడు అల్లు అరవింద్​..‌ తండ్రి ప్రస్థానం కొనసాగిస్తూ మంచి సినిమాలతో పాటు పంపిణీ సంస్థను కూడా వృద్ధిచేసి ఇప్పుడున్న నిర్మాతలకు తలమానికంగా నిలిచారు.

అల్లు రామలింగయ్య సినీ ప్రస్థానం మూడుపువ్వులు ఆరు కాయలుగా విస్తరించి అల్లు వంశాన్ని సుస్థిరం చేసింది. తన 82వ ఏట మనవడు అల్లు అర్జున్‌ హీరోగా ఎదుగుతున్న ఉచ్చదశను వీక్షిస్తూ జూలై 31, 2004న రామలింగయ్య కన్నుమూశారు. మరణానంతరం తన కళ్లును దానం చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.