కరోనాపై పోరుకు ప్రధాని నరేంద్రమోదీ చేసిన సూచనలను ప్రజలందరూ పాటించాలని... జనసేనాని పవన్‌కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22న జనతా కర్ఫ్యూలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితమవ్వాలని పవన్ కోరారు. వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి బాల్కనీలో నిలబడి కరతాళ ధ్వనుల ద్వారా సంఘీభావం తెలపాలని కోరారు.
ఇవీ చూడండి: సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. కరోనాపై చర్చ