ETV Bharat / city

'నేడు అఖిలపక్షాల వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం' - irtual round table meet in zoom

కొవిడ్​ నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న తీరుకు నిరసనగా నేటి నుంచి అఖిల పక్షాలు నిరసన చేపట్టనున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వా వైఫల్యను ఎండగట్టేందుకు తెజస,సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీటీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీలు, ప్రజాసంఘాలన్నీ కలిసి కొవిడ్‌ నిబంధనలకు లోబడి వర్చువల్ సమావేశాలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి.

'నేడు అఖిలపక్షాల వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం'

author img

By

Published : Jul 27, 2020, 5:41 AM IST

కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా చేతులెత్తేశాయని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని... ఆహార భద్రత, వైద్యసేవలు అథమ స్థాయిలో ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యాలపై అఖిలపక్షాలతో నిరసనలు, న్యాయపోరాటాలు చేసినా.. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వా వైఫల్యను ఎండగట్టేందుకు తెజస,సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీటీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీలు, ప్రజాసంఘాలన్నీ కలిసి కొవిడ్‌ నిబంధనలకు లోబడి వర్చువల్ సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి.

నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు వివిధ రూపల్లో నిరసనలు, ఆన్‌లైన్‌ సమావేశాలు నిర్వహించానున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం జూమ్ ద్వారా నిర్వహించనున్నారు. జూలై 30న అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకు నల్లజెండాలతో నిరసనగా వెళ్లి మెమోరాండం అందజేయనున్నారు.

ఇవీ చూడండి: బ్యాంకు ఉద్యోగిపై.. దానం నాగేందర్​ దౌర్జన్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.