ETV Bharat / city

చర్చల పేరుతో రైతు సంఘాల్లో చీలిక తెస్తున్నారు: బీవీ రాఘవులు

నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్​ వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

all party agitation at indira park against new agriculture acts
చర్చల పేరుతో రైతు సంఘాల్లో చీలిక తెస్తున్నారు: బీవీ రాఘవులు
author img

By

Published : Dec 14, 2020, 2:04 PM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా... ఇందిరా పార్క్​ వద్ద అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం మరిం ఉద్ధృతం చేస్తామన్నారు.

చట్టాలు అమలులోకి వస్తే వ్యవసాయ రంగం, రైతాంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తుందని ఆవేద వ్యక్తం చేశారు. చర్చల పేరిట రైతు సంఘాల్లో మోదీ సర్కార్​ చీలికలు తీసుకొస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఏఐకేఎస్ ప్రతినిధులు పశ్య పద్మ, తీగల సాగర్, అచ్యుతరావు, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయండి: చాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.