ETV Bharat / city

తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చూపించిన యశోదమ్మ - కృష్ణాష్టమి ప్రత్యేక కథనం

Lord krishna ‘అబ్బబ్బా.. ఈ తరం పిల్లలు హైపరాక్టివ్‌ అండీ! అస్సలు పట్టుకోలేకపోతున్నాం’ అనుకోని అమ్మ కనిపించదు. మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రతి తరంలోనూ అలానే అనుకుంటారు. అలనాటి కన్నయ్య నుంచీ నేటి బుజ్జాయిల దాకా.‘రాజవత్‌ పంచవర్షేషు’ అన్నారు. అంటే పిల్లల్ని ఐదేళ్ల వరకూ రాజులా చూడాలన్నది ఆర్యోక్తి. నిజానికి పెళ్లయిన దగ్గర్నుంచీ పిల్లల కోసం తపించే యువతులు పుట్టిన సంతానాన్ని రాజులా కాదు, దైవంలా చూస్తారు. మాతృత్వాన్ని భారంగా కాక బాధ్యతగా స్వీకరిస్తారు. అంత మురిపెంగా చూసుకున్న పిల్లలు దారి తప్పడమో, చెడిపోవడమో కనిపించదు. నాటి చిలిపి కృష్ణుని అల్లరి ఎంత మధురంగా ఉంటుందో చదివి తరించండి.

lord krishna
చిలిపి కృష్ణుడు
author img

By

Published : Aug 19, 2022, 12:13 PM IST

Updated : Aug 19, 2022, 12:54 PM IST

Lord krishna: బిడ్డని పెంచటం ఒక అదృష్టంగా భావించి తరించిన తల్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది యశోద. కంసుడి వల్ల హాని ఉందని భయపడిన దేవకి తన బిడ్డ భారాన్ని నంద, యశోదలకు అప్పజెప్పింది. ఇక ఆ పసివాణ్ణి పరమాత్మగా భావించి సేవించి తరించింది యశోదమ్మ. ఆ సేవకి మురిసిన చిన్నికృష్ణయ్య తన నోటిలోనే బ్రహ్మాండాన్ని దర్శింపచేశాడు. ‘కలయో వైష్ణవ మాయో..’ అనుకుంది. ‘సర్వాత్ముడాది విష్ణుండగుట నిజము’ అని గుర్తించింది. కానీ మళ్లీ మాయ కమ్మేట్టు చేశాడు నందకిశోరుడు. ఆ మాయ ఏ స్థాయికి వెళ్లిందంటే, బాలగోపాలుడు పెరుగు కుండని పగులగొట్టగానే తెగ కోపం వచ్చేసింది. దండిస్తే తప్ప దారికి రాడనుకుంది. కొట్టాలని వెంట పడింది. దొరికితే కదా! ‘వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా.. ఎన్నడును వెన్న కానరట కదా..’ అంటూ పట్టుకోబోయి అలసిపోయింది. తన కొడుకు బంగారుకొండ అనుకునే తల్లికి తప్పు చేస్తూ దొరికిపోతే ఎంత ఉక్రోషం వస్తుందో అంతా వచ్చింది యశోదకి. ఏ తల్లికైనా తన బిడ్డ ఒప్పులకుప్ప, సుగుణాలరాశి అనే భావనే ఉంటుంది. అది వాస్తవం. ఎందుకంటే, ప్రతి శిశువూ పుట్టినప్పుడు స్వచ్ఛంగా, దైవానికి ప్రతిరూపంగా ఉంటుంది. అందుకే జోలపాటల్లో పిల్లల్ని దేవుడితో పోల్చారు. అలా భావిస్తే పెంపకం మధురంగా తోస్తుంది. అది పిల్లల్లోనూ ప్రతిఫలిస్తుంది. బాల్యం సంతోషంగా సాగితే మానసిక అనారోగ్యాలుండవని మనోవైజ్ఞానికులూ చెపుతున్నారు.

అలాగే అనుభూతి చెందింది యశోద. ఇరుగుపొరుగు వారొచ్చి కృష్ణుడి అల్లరి పనులు ఏకరవు పెడితే కన్నయ్య కడిగిన ముత్యం, ఏ పాపం ఎరగడు, తన ఒడిని వీడి కదలనే లేదు, కడుపునిండా పాలు తాగి బజ్జున్నాడంటుంది. అది వాదన కానే కాదు. యశోద మనోభావన. చిన్నారి కృష్ణుడు సాక్షాత్తు దైవంలానే కనిపించాడు. కానీ గోపికలు చాడీలు చెప్పినట్టుగా తన ఎదుటే గోలచేస్తూ దొరికిపోయాడు. తన నమ్మకం వమ్మయిపోయిందే అని బాధపడింది. దండిద్దామంటే చేజిక్కక అలిసిపోయింది. ‘దొరకరా నాయనా!’ అంటూ బతిమాలింది. అంత ఆర్తితో అడిగితే అందడా? ఇక్కడ యశోదమ్మే బిడ్డ, చిన్ని కృష్ణుడే తల్లి! ఆటల్లో పిల్లలకి తల్లి దొరికిపోతుంది. తాను ఓడిపోయి, పిల్లలే గెలిచారన్న భావన కలిగిస్తుంది. అదే జరిగింది. లక్ష్మీదేవి కౌగిటికి చిక్కనివాడు, సనకాది మునుల మనసులో నిలవనివాడు, వేదాలు చదివినా అర్థం కానివాడు.. ఆశ్చర్యంగా తల్లి యశోద చేతికి చిక్కి రోలుకు బంధితుడయ్యాడు.

.

సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చిన కుంతీదేవి ఆ సన్నివేశం తన మనసులో ముద్రించుకుపోయిందని చెప్పింది. చుట్టంచూపుగా వచ్చిన కుంతికే ఆ దృశ్యం అంత మనోహరంగా ఉంటే.. ఇక యశోద స్థితి ఏమై ఉంటుంది?! అంతే మరి ముద్దుల మూటల్లాంటి చిన్నారి చిలిపిచేష్టలకు మురవని తల్లి ఉంటుందా! లాలిపోస్తూ, అన్నం తినిపిస్తూ, జోల పాడుతూ మాతృత్వాన్ని ఆనందిస్తుంది. ఆ ఆగడాలను సుతిమెత్తగా ఖండిస్తూ సున్నితంగా సరిచేస్తుంది. ఇంకా విసిగించినా నిగ్రహం కోల్పోకుండా నయానో భయానో నచ్చజెప్తుంది. పిల్లలంతా గారాల చిన్ని కృష్ణులే. తల్లులంతా ప్రేమానురాగాల యశోదమ్మలే!

ఇవీ చదవండి:

Last Updated : Aug 19, 2022, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.