ఎన్‌కౌంటర్ ఘటనపై హైకోర్టులో అత్యవసర విచారణ
దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై హైకోర్టు స్పందించింది. అత్యవసర విచారణ జరుపుతామని వెల్లడించింది. మృతదేహాలను ఈ నెల 9 తేదీ రాత్రి 8 వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9న ఉదయం 10.30 గం.లకు హైకోర్టు విచారణ జరపనుంది. సాయంత్రం 6 గం.కు అందిన వినతిపత్రంపై హైకోర్టు అత్యవసరంగా స్పందించింది. హైకోర్టు విచారణకు అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ హాజరయ్యారు. గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో పోస్టుమార్టం జరుగుతోందని ఏజీ ధర్మాసనానికి వివరించారు.