త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం సినిమా దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. అంబర్‌పేటలోని శ్రీ రమణ థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవి ఆధ్వర్యంలో అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.
అభిమానులు ఏర్పాటు చేసిన అల వైకుంఠపురం 50 రోజుల వేడుకలకు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకు కట్ చేశారు. అల వైకుంఠపురం సినిమా విజయం అభిమానులు బన్నీకి ఇచ్చిన బహుమానం అన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇలాంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు తీసి.. తమ హీరో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని అభిమానులు అశాభావం వ్యక్తం చేశారు.